కాన్‌పూర్‌లోని దెహాత్ ఏరియా అక్బర్‌పూర్ కొత్వాలిలో ఉన్న బారా టోల్ ప్లాజాలో ఏప్రిల్ 25వ తేదీన ఓ కోతి టోల్‌బూత్‌లోకి చొరబడి అందులో ఉన్న క్యాష్ డ్రా లో నుంచి రూ.5వేలను ఎత్తుకెళ్లింది.
హైవేలపై ఉండే టోల్‌బూత్‌లలోకి చొరబొడి దోపిడీ దొంగలు నగదు అపహరించుకుపోయిన సంఘటనలను మనం గతంలో చాలానే చూశాం. అయితే ఇప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కాకపోతే దొంగతనం చేసింది మనుషులు కాదు.. కోతి..! అవును, మీరు విన్నది నిజమే. ఓ టూల్ బూత్‌లోకి చొరబడ్డ కోతి క్యాష్ డ్రాలో ఉన్న బండిల్స్‌లో చేయి పెట్టి ఎంచక్కా రూ.5వేలను దొంగిలించి తాపీగా అక్కడి నుంచి జారుకుంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే…
కాన్‌పూర్‌లోని దెహాత్ ఏరియా అక్బర్‌పూర్ కొత్వాలిలో ఉన్న బారా టోల్ ప్లాజాలో ఏప్రిల్ 25వ తేదీన ఓ కోతి టోల్‌బూత్‌లోకి చొరబడి అందులో ఉన్న క్యాష్ డ్రా లో నుంచి రూ.5వేలను ఎత్తుకెళ్లింది. అయితే ఆ కోతి అప్పుడే అక్కడికి వచ్చిన ఓ కారు విండోలో నుంచి బయటకు వచ్చింది. దీంతో ఆ కారు నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైనా వ్యక్తులు ఆ కోతికి ట్రెయినింగ్ ఇచ్చి ఉండవచ్చని, అందుకే కారు లోంచి అది దిగగానే నేరుగా బూత్ లోకి ప్రవేశించి క్యాష్‌ను ఎత్తుకెళ్లిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కోతి క్యాష్ దొంగిలించుకుపోతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆ సీసీటీవీ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా.. ఇకపై నగదును దొంగిలించే జంతువుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే మన డబ్బులను అవి దొంగిలిస్తే చేసేదేమీ ఉండదు కదా..!