టాయిలెట్ పేప‌ర్ అని గూగుల్‌లో కొడితే.. పాకిస్థాన్ జెండా వ‌స్తుంది.. షాకింగ్‌..!

-

పుల్వామాలో భార‌త సైనికుల‌పై పాక్ ఉగ్ర‌వాదులు జ‌రిపిన మార‌ణ కాండ‌ను భార‌తీయులంద‌రూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. అందుక‌నే చాలా మంది ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ గ‌ళం వినిపిస్తున్నారు. పాకిస్థాన్‌పై భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకోవాల్సిందేన‌ని, 82 మంది ఉగ్ర‌వాదుల‌ను భార‌త సైనికులు చంపాల‌ని.. ఇలా ర‌క ర‌కాలుగా డిమాండ్లు చేస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం వెరైటీగా పాక్‌పై త‌మ అక్క‌సు తీర్చుకుంటున్నారు. అదెలాగో మీరే చూడండి…

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ సైట్ గూగుల్‌లో ఇప్పుడు ‘toilet paper’ అని టైప్ చేసి సెర్చ్ చేసి చూడండి. ఏం క‌నిపిస్తుంది ? అవాక్క‌య్యారా… అవును, టాయిలెట్ పేప‌ర్ల‌కు బ‌దులుగా పాక్ జెండా క‌నిపిస్తుంది క‌దా. అవును, కొంద‌రు టాయిలెట్ పేప‌ర్‌కు బ‌దులుగా పాకిస్థాన్ జెండాల‌ను స్క్రీన్ షాట్లు తీసి ప‌లు వెబ్‌సైట్ల‌లో పెట్టి వాటికి టాయిలెట్ పేప‌ర్ అని పేరు పెట్టారు. అనంత‌రం వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో గూగుల్ కూడా పాకిస్థాన్ జెండాల‌ను టాయిలెట్ పేప‌ర్లుగానే భావించి.. టాయిలెట్ పేప‌ర్ అని కొట్ట‌గానే పాకిస్థాన్ జెండాల‌నే చూపిస్తోంది.

అయితే కేవ‌లం టాయిలెట్ పేప‌ర్ అని మాత్ర‌మే కాకుండా… బెస్ట్ టాయిలెట్ పేపర్ ఇన్ ద వ‌ర‌ల్డ్, టాయిలెట్ పేపర్, చైనా మేడ్ టాయిలెట్ పేపర్ అని సెర్చ్ చేసినా చాలు.. పాకిస్థాన్ జెండాలే ఇప్పుడు గూగుల్ సైట్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. దీంతో ఇప్పుడీ వార్త కాస్తా వైర‌ల్ అయి అది కాస్తా గూగుల్ దాకా చేరింది. దీంతో స్పందించిన గూగుల్‌.. ఎక్క‌డో ఏదో పొర‌పాటు జ‌రిగింద‌ని, దాన్ని స‌రిద్దిదుతామ‌ని తెలిపింది. ఏది ఏమైనా.. మ‌న వాళ్లు పాకిస్థాన్‌ను ఒక ఆట ఆడుకుంటున్నారు క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news