ఇంజినీర్‌తో గుంజీలు తీయించిన ఎమ్మెల్యే.. వీడియో

508

ఓ ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌తో గుంజీలు తీయించాడు. ఒకటి కాదు రెండు కాదు.. 100 గుంజీలు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బిజూ జనతా దళ్ పార్టీకి చెందిన సరోజ్ కుమార్ మెహెర్.. ఒడిశాలోని పాట్నాగఢ్ నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం.. తన నియోజకవర్గంలో పర్యటించారు. ఈసందర్భంగా తన నియోజకవర్గంలోని గ్రామాలను సందర్శిస్తూ.. నాణ్యత లేని రోడ్లను గమనించారు. వెంటనే అక్కడ రోడ్డు వేసిన సంబంధిత ఇంజినీర్‌ను అక్కడికి పిలిపించి.. ప్రజల ముందే గుంజీలు తీయించారు. గ్రామస్తులకు క్షమాపణలు కూడా చెప్పించారు.