ఓరి దేవుడోయ్.. ఇలా అయితే.. ఇక రెస్టారెంట్లకు ఏం వెళ్తాం. అసలే ఇవాళ సండే. అలా ఫ్యామిలీతో బయటికి వెళ్లి 2.0 సినిమా చూసి ఏదైనా మాంచి రెస్టారెంట్‌లో బిర్యానీయో లేక ఏదైనా మంచి నాన్ వెజ్ డిష్ తిని వద్దామని ప్లాన్ వేస్తున్నారా.. కాస్త ఆగండి. ఇది చదివాక మీరు ప్లాన్లు వేసుకోండి.
ఏపీలోని గుంటూరులో ఉన్న కొన్ని రెస్టారెంట్లే ఇటువంటి నీచ నికృష్ట బుద్ధికి పాల్పడేది. ఎవరో ఒక కస్టమర్ వస్తాడు. బిర్యానీ ఆర్డరిస్తాడు. లేదా మరోటి ఆర్డరిస్తాడు. సర్వర్ ఆర్డర్ తీసుకొస్తాడు. ఆ కస్టమర్ సగం అన్నం అలాగే వదిలేస్తాడు. ముక్క కూడా సగం తిని మిగితాది అక్కడే వదిలేసి వెళ్తాడు. ఆ కస్టమర్ వెళ్లిపోయాక.. సర్వర్లు బిర్యానీ మిగిలిపోయి ఉన్న ప్లేట్‌ను తిన్నగా కిచెన్‌లోకి తీసుకెళ్లి మిగిలిన అన్నాన్ని, సగం తిని వదిలేసిన చికెన్, మటన్ ముక్కలను కూడా అదే బిర్యానీలో కలిపి వేరే కస్టమర్లకు వడ్డిస్తున్నారట. అది అసలు సంగతి.. దీని గురించి తెలుసుకున్న కొంత మంది కస్టమర్లు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారట. దానిపై విచారణ చేస్తున్నారట. వామ్మో.. ఎంతైన బయటి ఫుడ్డు బయటి ఫుడ్డే. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అది ఎంత పెద్ద తోపు రెస్టారెంట్ అయినా సరే.