ట్రాఫిక్‌ దెబ్బకు కారు దిగి ఆటో ఎక్కిన మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈవో..

-

మెర్సిడెజ్ బెంజ్ అంటే ఒక రేంజ్..కార్లలోనే లగ్జరీ కారుగా పేరు ఉంది. అలాంటి మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్‌ ష్వెంక్‌కి ఇండియాలో వింత అనుభవం ఎదురైంది. మన దగ్గర ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. ట్రాఫిక్‌ ఉండే ఏరియాలో వెళ్లాలంటే.. రెండు గంటల ముందే స్టాట్‌ అవ్వాలి. పుణెలో ఖరీదైన తన కారులో ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈవోకు అక్కడి ట్రాఫిక్ చుక్కలు చూపించింది. ట్రాఫిక్‌ సమస్య కారణంగా ఆయన తన కారుని వదిలి ఓ కిలోమీటరు నడిచి వెళ్లి పాపం ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఓ ఆటో రిక్షా ఎక్కి సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో గమ్యస్థానానికి చేరుకున్నాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

సెప్టెంబర్ నెలాఖరున రాత్రి సమయంలో పూణేలో తన ఎస్ క్లాస్ కారులో మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్ ష్వెంక్ ప్రయాణిస్తున్నారు. అయితే అప్పుడు తేలికపాటి వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న రూట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమయం గడుస్తున్నా ట్రాఫిక్ మాత్రం క్లియర్ కాలేదు. దీంతో ఇలాగే అయితే తెల్లారిపోతుందని భావించిన మార్టిన్..కారు దిగి ఓ కిలోమీటరు నడుచుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ఓ ఆటో ఎక్కి గమ్యస్థానానికి చేరుకున్నాడు. తర్వాత తనకెదురైన వింత అనుభవాన్ని ఫోటోలతో సహా ఇన్‌ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో పాటు అద్భుతమైన పుణె రోడ్లపై మీ ఎస్ క్లాస్ కారు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే మీరు ఏం చేస్తారు? కారు దిగి కిలోమీటర్ దూరం నడిచి ఆటో ఎక్కుతారా? అని కామెంట్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అవడంతో నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్‌ అయ్యారు..

2006లో మెర్సిడెస్ బెంజ్‌లో జాయిన అయిన మార్టిన్.. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి 2018 వరకు మెర్సిడెస్ బెంజ్ చైనా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పని చేశారు. 2018 నుంచి బెంజ్ కంపెనీ సీఈవోగా చేస్తున్నారు. భారతదేశంలో మెర్సిడెస్ తన లగ్జరీ కార్ల అమ్మకాలను పెంచడానికి కొత్త రిచ్ క్లాస్‌పై దృష్టి సారిస్తోంది. భవిష్యత్తులో కార్ల వినియోగంలో గణనీయమైన మార్పును తీసుకురానున్నట్లు మార్టిన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news