ఘంటసాల గుర్తున్నారా మీకు. పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు. ప్రముఖ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. అప్పట్లో ఘంటసాల పాడిన పాటలు ఇప్పటికీ తెలుగు ప్రజల మనసులో మెదులుతూనే ఉంటాయి. ఆయన పాటలు పాడిన దేవదాసు, కన్యాశుల్కం, దొంగ రాముడు, తోడి కోడళ్లు, డాక్టర్ చక్రవర్తి, ఇద్దరు మిత్రులు, అప్పుడు చేసి పప్పు కూడు, మూగ మనసులు, మంచి మనసులు… ఇలా అలనాటి మేటి సినిమాల్లో ఆయన పాడని పాటలు లేవు. అంత ఫేమస్ ఆయన. ఇప్పటి తరానికి ఈయన కాస్త తక్కువ పరిచయమే అయినా… మన తాతలకు ఆయన గురించి బాగా తెలుసు.
అసలు విషయం ఏంటంటే… ఓ వ్యక్తి… అచ్చం ఘంటసాల గొంతుతో పాటలు పాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చం ఘంటసాల గొంతుతో ఆయన పాడిన పాటలకు నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ఆహా.. ఎంత మధురంగా పాడుతున్నాడు ఈయన. అభినవ ఘంటసాల.. అంటూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. సూర్యాపేటకు చెందిన ఈ వ్యక్తి ఇటుకలు చేసుకుంటూ తన జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. మీరు కూడా ఓ సారి ఈ రైతన్న పాడిన పాటలు విన్నారంటే ఫిదా అవ్వాల్సిందే. ఇటీవలే బేబీ అనే ఓ మహిళ.. ఇలాగే సోషల్ మీడియాలో పాట పాడటం.. ఆ పాటను సెలబ్రిటీలు చూసి ఆమెకు సినిమా పాటల్లో అవకాశాలు ఇవ్వడం కూడా చూశాం కదా. మరి.. ఈ అభినవ ఘంటసాలకు కూడా సినిమాలో అవకాశాలు రావాలని ఆశిద్ధాం.