ఎన్.టి.ఆర్ ను దాటేసిన ప్రభాస్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ ఇద్దరే.. అయితే ప్రభాస్ కన్నా ముందు తారక్ కు స్టార్ ఇమేజ్ వచ్చిందనుకోండి. అయితే బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా ప్రభాస్ కు క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ తోనే మిగతా స్టార్స్ ను కొన్ని విషయాల్లో దాటేస్తున్నాడు. ఈమధ్యనే ఇన్ స్టాగ్రాం ఎకౌంట్ ఓపెన్ చేసిన ప్రభాస్ అప్పుడే 1 మిలియన్ ఫాలోవర్స్ ఏర్పరచుకున్నాడు. ఈ విషయంలో ఎన్.టి.ఆర్ వెనుకపడి ఉన్నాడు.

తారక్ కు ఇప్పటివరకు 8 లక్షలకు అటు ఇటుగా మాత్రమే ఇన్ స్టాగ్రాం ఫాలోవర్స్ ఉన్నారు. క్రేజ్ పరంగా ఇద్దరు సమానమే అనుకున్నా ఇన్ స్టా ఫాలోవర్స్ లో మాత్రం తారక్ కన్నా ప్రభాస్ ముందున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.