పాలుతాగటానికే అక్కడ బార్ కు వెళ్తారట.. ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజమండి.!

-

బార్లంటే ఒక వర్గానికి స్వర్గం లాంటివి..దొరకిని బ్రాండ్ ఉండదు అక్కడ.. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. కానీ అక్కడ బార్ కి అందరూ పాలు తాగటానికి వస్తుంటారట. అసలు బార్లో పాలుతాగుండేంటి అనుకుంటున్నారా..ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..మీకే అర్థమవుతుంది.
ఆఫ్రికాలోని ర్వాండా దేశ రాజధాని కిగాలీలోకి ప్రజలు ప్రతి రోజూ బార్‌కు వెళతారు. అక్కడ పాలు తాగుతారు. ఇది వారి సంప్రదాయంలో భాగమట. ఇక్కడ పాలు తాగేందుకు వచ్చే వాళ్లు చెప్పే కారణాలు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి. ప్రశాంతంగా ఉండేందుకు తాను రోజు పాలు తాగుతానని ఓ మోటార్ సైకిల్ డ్రైవర్ తెలిపాడు. అంతేకాదు పాలు తాగడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని వెల్లడించాడు. తనతో పాటు అనేక మంది ఇదే కారణంతో పాలు తాగేందుకు బార్‌కు వస్తారని ఆ డ్రైవర్ అంటున్నాడు.
ర్వాండాలో పాలు ఎంతో పాపులర్ డ్రింక్ అట..మనకు ఇక్కడ చాలా మందికి పాలు అంటే అస్సులు ఇష్టం ఉండదు. అససు ఆ వాసన పీల్చటానికే ఇష్టపడరు. కానీ అక్కడ అనేకమందికి పాలు అంటే పాపులర్ అంట. ఇంకా ఆ బార్లలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు కలిసి పని చేస్తుంటారు. పురుషులు, స్త్రీలు ఇక్కడ పాల బార్లలో కనిపిస్తారు. ఇక్కడ బార్లలో చల్లని పాలతో పాటు వేడి పాలు ఉంటాయట. పాలతో పాటు కేక్‌లు, బ్రెడ్లు, అరటిపండ్లు తినేందుకు ఇక్కడ వాళ్లు ఆసక్తి చూపిస్తుంటారు అని బార్ యజమానులు చెప్తున్నారు.
పాలు ఇక్కడి దేశ సంప్రదాయం. దీనికో పెద్ద చరిత్రతే ఉందట. ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పాలు ఓ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఆవులు ఇక్కడ ప్రజల ఆదాయంలో ఎంతో కీలకమైనది. ఈ దేశంలో 1994లో జరిగిన మారణకాండలో 8 లక్షల మంది చనిపోయారు. వాళ్లలో ఎక్కువమందిని టుటీస్ అంటారు. వాళ్లలో ఎక్కువమంది పశువులు, గొర్ల కాపర్లే. ఆ మారణకాండ నుంచి దేశం కోలుకోవడంతో ఇప్పుడు మళ్లీ ఆవును పెంచుతూ దేశం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడంతో పాటు ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు..

ఈ దేశ అధ్యక్షుడు పాల్ కగామే 2006లో గిరింకా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని ప్రకారం దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఒక ఆవును ఇస్తారు. ఆ దేశ ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇప్పటివరకు అక్కడ 3 లక్షల 80 వేల ఆవులను పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ దేశంలోని ఓ గ్రామానికి 200 ఆవులు పంపిణీ చేశారట. ఇలా పాలకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు అక్కడి ప్రజలు. పాలల్లో ఉండే పోషకాలు గురించి మనందరికి తెలుసు కానీ..చాలమందికి పాలంటే అస్సలు నచ్చదు. అలాంటి వారు మీ ఫ్రెండ్స్ ఎ‌వరైనా ఉంటే..ఈ ఆర్టికల్ షేర్ చేసి పాలకు వీళ్లు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో తెలియజేయండి.!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news