రామప్పకు పెరిగిన భక్తుల రద్దీ .. యునెస్కో గుర్తింపు తర్వాత పెరిగిన భక్తులు

-

తెలంగాణలో ప్రసిద్ధ దేవాలయం రామప్పకు భక్తుల రద్ధీ పెరుగుతోంది. యునెస్కో గుర్తింపు తర్వాత దేవాలయాన్ని చూడటానికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు వీకెండ్ కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మనరాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్ రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తున్నారు. ఇవే కాకుండా ములుగు, భూపాలపల్లి జిల్లాలోని దర్శనీయ ప్రదేశాలు ఉండటం కూడా పర్యాటకుల సంఖ్య పెరగడానికి కారణంగా ఉంది. వర్షాకాలం కావడంతో ములుగు జిల్లాలోని బోగత జలపాతం కనువిందు చేస్తోంది. జిల్లాలోని లక్నవరం, రామప్ప సరస్సులు, మేడారం పుణ్యక్షేత్రాన్ని కూడా పనిలో పనిగా యాత్రికులు సందర్శిస్తున్నారు. వీటితో పాటు సమీప జిల్లా అయిన జయశంకర్ భూపాలపల్లిలోని కాకతీయుల నాటి కోటగుళ్లు, గణపసముద్రం చెరువు యాత్రికులకు కనువిందు చేస్తోంది. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం ప్రాజెక్ట్ లు నిండు కుండల్లా ఉండటంతో సమీప ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారు. రామప్పకు యునిస్కో గుర్తింపు రావడం, అడవులు, పర్యాటకుల ప్రాంతాలు ఎక్కువగా ఉండీ ఒకేరోజులో కవర్ చేసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు యాత్రికలు రద్దీ పెరిగింది. హైదరాబాద్ నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంలో భక్తులు, యాత్రికులు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news