నవరాత్రి రోజున అక్కడ పురుషులు చీరలు కట్టుకుని డ్యాన్స్‌ చేస్తారట.. ఎందుకంటే..!!

-

దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి.. పండగ ఒకటే అయినా పాటించే పద్ధతులు, సంప్రదాయాలు వేరు. కొన్ని మనకు తెలిసినవే.. మరికొన్ని అస్సలు మీరు ఊహించలేరు. ఇలా కూడా చేస్తారా అనుకుంటారు..!! అలాంటి ఒక వెరైటీ సంప్రదాయం గురించి ఈరోజు చెప్పుకోబోయేది. ఆ రాష్ట్రంలో నవరాత్రి స్పెషల్‌ పురుషులు చీరలు కట్టుకుని డ్యాన్స్‌ చేస్తారట.. ఆ గుళ్లోకి పురుషులకు అనుమతి లేకపోవడంతో ఇలా చీరలు కట్టుకుని వెళ్తారట.. ఇంతకీ ఏంటా గుడి ఎక్కడ ఉందంటే..!!

గుజరాత్‌లోని గర్భా నృత్యం ఫెమస్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే… అక్కడ అహ్మదాబాద్‌లోని పాతబస్తీలో పురుషులు నవరాత్రి వేడుకలు రాగానే చీరలు కట్టుకుని మరీ గర్భాడ్యాన్స్ చేస్తారు. నవరాత్రి వేడుకలలో ఎనిమిదవ రోజున బరోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ 200 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారట.

దీనివెనుక ఒక పురాణ గాథ ఉంది. అదేంటంటే..సదుబా అనే మహిళ తన బిడ్డను, ఎవరో పురుషుడి వలన పొగొట్టుకుంది. దీంతో ఆమె పురుషులకు శాపం పెట్టింది. దీంతో అక్కడి వారు.. సదుబా చనిపోయాక ఆమెకు గుడి కట్టించారు. అంతే కాకుండా… ఆలయాన్ని సందర్శించే పురుషులు తప్పినసరిగా చీరలు ధరించి వెళ్లాలి. అక్కడు పురుషులు వెళ్లి ప్రార్థన చేసి, ఆమెకు క్షమాపణ కోరతారు. ఈ సంప్రదాయం 200 ఏళ్ల నాటిదని నమ్ముతారు.

అష్టమి రోజున, నగరం నలుమూలల నుంచి వందలాది మంది బారోట్ కమ్యూనిటీకి చెందిన వారు సాదు మాతకు నమస్కారాలు చెల్లించడానికి సమావేశమవుతారు. అక్కడ చీరలు ధరించి గర్భా డ్యాన్స్ చేస్తారు. సో అలా మొత్తానికి ఈ ఆచారం సాగుతుంది. పురుషులు చీరలు కట్టుకుని డ్యాన్స్‌ చేయడంతో ప్రతీ ఏటా ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారుతుంది. సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అవుతాయి. అయినప్పటికీ అవేం పట్టించుకోకుండా ఆ కమ్యునిటీ పురుషులు ఇంకా ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నారు. కావాలంటే మీరు సోషల్‌ మీడియాలో వీడియో చూడొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news