సురక్షితంగా రంజాన్ ని చేసుకోవడానికి ఈ పద్ధతులని అనుసరించండి..!

-

ఈసారి మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఎప్పటిలాగ రంజాన్ పండుగ చేసుకోవడం కుదరదు. ఇఫ్తార్ టెంట్స్, అందరూ కలిసి ఉండటం లాంటివి కుదరదు అంటే దీనికి అర్ధం రంజాన్ చేసుకోలేము అని కాదు. మీరు మీ కుటుంబ సభ్యుల తో కూడా కలిసి రంజాన్ ని చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతిని కనుక మీరు అనుసరించారు అంటే సురక్షితంగా రంజాన్ పండుగ చేసుకోవడానికి వీలు అవుతుంది. మరిక ఆ పద్ధతులు కోసం చూసేయండి..!

ఇంట్లో చేసుకోవడం లేదా టేక్ అవే తీసుకోవడం:

రంజాన్ సందర్భంగా చాలా మంది స్పెషల్ వంటకాలు అన్నీ చేస్తూ ఉంటారు. హోటల్స్ లో కూడా ప్రత్యేకమైన రంజాన్ వంటకాలని తయారు చేస్తారు. అయితే హోటల్ కి, రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ కూర్చుని తినడం మంచిది కాదు. దీనికి బదులుగా మీరు ఇఫ్తార్ మిల్స్ ని ఆర్డర్ చేసుకుని తినొచ్చు లేదా చక్కగా ఇంట్లో చేసుకుని తినొచ్చు.

వర్చువల్ గా ఫ్రెండ్స్ తో రంజాన్ చేసుకోండి:

అయితే ఎక్కువ మంది ఒక చోట ఉండడం కుదరదు. కాబట్టి చుట్టాల ఇంటికి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లడం మానేయండి. ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండి వర్చువల్ గా స్మార్ట్ ఫోన్స్ తో పండుగని చేసుకుంటే మంచిది.

డిజిటల్ కురాన్ ని డౌన్లోడ్ చేసుకోండి:

మామూలుగా కురాన్ ని అందరు ముట్టుకుంటారు. మసీదుకు వెళ్లేటప్పుడు డిజిటల్ గా మీరు మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వెళ్ళండి. దీనివల్ల మీరు సేఫ్ గా ఉండొచ్చు.

పెద్ద పెద్ద పార్టీలు ని నిర్వహించవద్దు:

పండుగ అయినా సరే సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకని పెద్ద పెద్ద పార్టీలు నిర్వహించుకోకండి. ఈ పరిస్థితి చక్కబడిన తరువాత మీరు పార్టీలు నిర్వహించుకోవచ్చు. ఇలా కనుక మీరు ఈ పద్ధతులను అనుసరించారు అంటే సురక్షితంగా ఉండొచ్చు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news