టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అవుతున్నట్లే కనిపిస్తుంది. అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ గాని పొత్తుకు రెడీగానే ఉన్నారు..కాకపోతే రెండు పార్టీల శ్రేణులు పొత్తు కోసం ఇంకా రెడీ అవ్వాల్సి ఉంది. అయితే అధినేతలు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో టిడిపి-జనసేన పొత్తు దాదాపు ఖాయమనే చెప్పాలి. ఇక బిజేపితో జనసేన తెగదెంపులు దిశగా వెళుతుంది.
టిడిపితో కలిసే ప్రసక్తి లేదని చెబుతున్న బిజేపి..పరోక్షంగా వైసీపీకి అనుకూలంగా ఉంది. దీంతో బిజేపికి జనసేన దూరంగా జరుగుతూ..టిడిపికి దగ్గరగా జరుగుతుంది. అయితే టిడిపి-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ కానీ..సీట్ల విషయంలో పంచాయితీ నడిచేలా ఉంది. పైగా పొత్తు ఉంటే పవన్‌కు సీఎం సీటు ఇవ్వాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అసలు 10 శాతం ఓట్లు కూడా లేవు..పట్టుమని 10 సీట్లు గెలవడం కష్టం..అలాంటప్పుడు పవన్ కు సిఎం సీటు ఎలా ఇస్తామనేది టిడిపి శ్రేణులు చర్చినుకుంటున్నాయి.
సిఎం సీటు అడిగే లెక్క అయితే జనసేనతో పొత్తు అవసరం లేదనే భావనలోనే టిడిపి శ్రేణులు ఉన్నాయి. ఇక చంద్రబాబు ఉండగా సిఎం సీటు పవన్ కు దక్కడం అనేది కల. పవన్ కూడా సిఎం సీటు ఆశించడం లేదు..తమ పార్టీకి గౌరవప్రదమైన సీట్లు దక్కితే చాలు అని అనుకుంటున్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం సిఎం అంటూ హడావిడి చేస్తున్నాయి. అటు కొందరు కాపు నేతలు..జోగయ్య లాంటి వారు పవన్ కు సిఎం పదవి ఇచ్చి..చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అంటున్నారు.
కానీ ఇదేమి జరిగే పని కాదని చెప్పవచ్చు. కొన్ని సీట్లు మాత్రం ఇస్తారు గాని..పవన్ కు సిఎం సీటు వదలడానికి టిడిపి రెడీగా ఉండదు. అంతకు కావాలంటే పొత్తు వదులుకునే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.