ఎండాకాలం వేడిని తట్టుకునేందుకు కావాల్సిన ఐదు ఆహారాలు..

-

ఒక పక్క మండే ఎండలు తీవ్రరూపం దాలుస్తుంటే కరోనా రక్కసి విలయతాండవం చేస్తుంది. ఏదైనా పని మీద బయటకి వెళ్దామంటే కరోనా కంటే ఎక్కువ ఎండలకే భయపడుతున్నారు. వస్తున్నది మే నెల కాబట్టి ఎండలు మరింత విరుచుకుపడతాయి. అందువల్ల మీకు మీరు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండ వేడి మీ శరీరాన్ని వేడి చేయకుండా ఉండడానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడిని తట్టుకోవడానికి నీళ్ళు తాగుతూ అవసరమైన ఆహార పదార్థాలని తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం.

పుచ్చకాయ

ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సింది పుచ్చకాయ గురించే. ఎందుకంటే ఇందులో 92శాతం నీరు ఉంటుంది. అదీగాక లైకోపీన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బీ6 ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలోని నీరు ఇంకిపోకుండా కాపాడుతుంది.

దోసకాయ

నిమ్మరసంలో ఉప్పు కలుపుని దానితో పాటు దోసకాయ తింటే మీ శరీరం వేడి చేయదు. ఎండ వేడిమిని తట్టుకోవాలంటే ఇంతకంటే చక్కని పానీయం ఉండదనే చెప్పాలి. శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో దోసకాయ ప్రముఖ పాత్ర వహిస్తుంది.

సెలెరీ

ఈ కూరగాయలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. అందువల్ల దీన్ని జ్యూస్ లాగా చేసుకుని తాగితే చాలా మంచిది. మార్కెట్లో విరివిగా లభిస్తుంది.

పెరుగు

రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎముకలు గట్టి పడడానికి పెరుగు బాగా పనిచేస్తుంది. ఇందులో కొంచెం ఉప్పు కలుపుకుని మజ్జిగలా చేసుకున్నా బాగుంటుంది. వేసవిలో పెరుగుని మించిన ఆహారం లేదు. పెరుగు తినాలనుకున్న వారికి ఇదే కరెక్ట్ టైమ్.

కాలీఫ్లవర్

విటమిన్ సి పుష్కలంగా లభ్యమయ్యే క్యాలీఫ్లవర్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సాయపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news