బరువు తగ్గడానికి రాత్రిపూట తీసుకునే స్నాక్స్.. మీకోసమే..

-

మన జీవక్రియ బరువుపై ఆధారపడి ఉంటుంది. జీవక్రియ సరిగ్గా ఉండడానికి బరువు తక్కువగా ఉండడం మంచిది. అధిక బరువు ఎప్పటికీ మంచిది కాదు. మీ ఎత్తు, వయసుకి తగిన బరువు ఉంటేనే మీ జీవక్రియ సరిగ్గా జరిగి అన్ని శరీర భాగాలకి కావాల్సిన శక్తి అందుతుంది. అందువల్ల మీరు చురుగ్గా ఉండగలుగుతారు. బరువు తగ్గాలని అనుకున్న చాలా మంది రాత్రిపూట తక్కువ తినాలని కోరుకుంటారు. కానీ కొన్ని సార్లు కొంతమంది తక్కువగా తింటుంటే ఆకలి వేసి ఎక్కువ తినాలని అనిపిస్తుంది.

అలాంటప్పుడు రాత్రి వేళల్లో అధిక పోషకాలుండే స్నాక్స్ ఎంచుకోవడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండు

అరటి పండులో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణమవుతాయి. బరువు పెరగకుండా ఉండాలంటే తొందరగా జీర్ణమయ్యే ఆహారాలని తీసుకోవాలి. అలాంటప్పుడు అరటి పండు చాలా మంచిది.

దోసకాయ, తెల్ల శనగలు

దోసకాయ ముక్కలని తెల్ల శనగలతో కలిపి తీసుకోవడం ఉత్తమం. తెల్ల శనగలలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇంకా బీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియకు బాగా సహకరిస్తాయి.

కాటేజ్ ఛీజ్

కాటేజ్ ఛీజ్ లో తక్కువ కొవ్వు ఉంటుంది. నిద్రపోయే ముందు దీన్ని తీసుకోవడం వల్ల సరిగ్గా నిద్రపడుతుంది.

పెరుగు

పెరుగులో పండ్లని కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది. ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, అరటి పండుని తీసుకుంటే పెరుగు పుల్లదనంతో పాటు తీపి తోడైతే ఇంకా బాగుంటుంది. ఇంకా కావాలంటే బ్లూ బెర్రీస్, క్రాన్ బెర్రీస్ అయినా మంచిదే. బరువు తగ్గాలన్న ఆలోచన మీకుంటే వీటిని పాటించండి.

Read more RELATED
Recommended to you

Latest news