ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయా? జ్ఞాపకశక్తిని పెంచే పొషకాహారాల గురించి తెలుసుకోండి..

-

కరోనా మహమ్మారి విద్యార్థుల చదువులని గందరగోళం చేసేసింది. ఎప్పుడు విద్యాసంస్థలు తెరుచుకుంటాయో, ఎప్పుడు మూతబడతాయో తెలియకుండా తయారయింది. ప్రస్తుతానికి తెలంగాణలో విద్యాసంస్థలు మూసి ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఐతే కొందరికి మాత్రం ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది, అసలు ఉంటాయా, ఉండవా అనేది ఇంకా తెలియదు. కాకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వారు తమ జ్ఞాపకశక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది.

జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎలాంటి పోషకాహారాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంట్లో చేసిన బ్రేక్ ఫాస్ట్

బయట కాకుండా ఇంట్లో చేసిన ఆహారాలు మాత్రమే తినండి. ప్రాసెస్ చేసిన ఫుడ్ కాకుండా ఇంట్లో చేసిన ఉప్మా, పోహా బాగుంటాయి.

నెయ్యి

నెయ్యిలో ఒమెగా 3 కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మంచివి. అందువల్ల రోజు వారి ఆహారంలో ఒక చెంచాడు నెయ్యి కలుపుకోవడం మంచిది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా మూడు పూటల మూడు చెంచాల నెయ్యి తీసుకోండి.

పెరుగు

పెరుగులో ఉండే బ్యాక్టీరియా సంతోషకర హార్మోన్లని రిలీజ్ చేస్తుంది. అందువల్ల మనం ఏది చదివినా అది మన మెదడుకి ఈజీగా చేరుతుంది. పరీక్షల సమయంలో మీరు సంతోషంగా ఉండడం చాలా అవసరం. అందుకే పెరుగుని మీ ఆహారంలో భాగం చేసుకోవడం మర్చిపోవద్దు.

రిఫైన్ చేయని చక్కెర

రక్తంలో చక్కెర శాతం తగ్గినా సమస్యే అని అందరికీ తెలిసిందే. చక్కెర శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది మెదడును బాగా ప్రభావితం చేస్తుంది. అందుకే లడ్డూలు, పల్లిపట్టీలు తినడం బాగానే ఉంటుంది.

బియ్యం

బియ్యం అన్ని విధాలా మంచిది. ఉబ్బసం కలగకుండా చూసుకుని ఇబ్బందులని దూరం పెడుతుంది. మంచి నిద్ర కావాలంటే అన్నం తింటే సరిపోతుంది. పెరుగన్నం ఇంకా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news