వెల్లుల్లి మంచిదే.. కానీ మీకు ఇలా ఉంటే అస్సలు తినొద్దు..!!

-

ఉల్లి, వెల్లుల్లి మసాల వంటల్లో ఇవి పడితే ఆ టేస్టే వేరు.. వాసనకే ఆకలి రెట్టింపు అవుతుంది. వెల్లుల్లి వల్ల ఎన్నో లాభాలు.. అటు వంటల్లోనూ.. ఇటు ఔషధంగానూ వెల్లుల్లిని ఉపయోగిస్తారు.. ఆఖరికి వెల్లుల్లి పొట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు. వెల్లుల్లి మంచిదే..రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది., అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇంత మంచిదైనా వెల్లుల్లికి కొంతమంది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంతకీ ఎవరు వాళ్లు..? ఎందుకు దూరంగా ఉండాలి..? తింటే ఏమవుతుంది..?

బొజ్జ సెన్సిటివ్‌ అయితే..

కొంతమంది పొట్ట చాలా సున్నితమైనదిగా ఉంటుంది. ఏం తిన్నా పడదు. జీర్ణవ్యవస్థ కాస్త అటు ఇటుగా ఉన్నవారు కూడా వెల్లుల్లిని తినకూడదు. ఎందుకంటే వెల్లుల్లిలో ఫ్రక్టాన్స్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది అన్నవాహిక లైనింగ్‌ను చికాకుపెడుతుంది. మంటను కలిగిస్తుంది.

స్మెల్ సమస్య ఉంటే..

కొందరికి నోరు, శరీరం ఘోరంగా వాసన వస్తుంది. పాపం వాళ్లు పైకి శుభ్రంగానే ఉంటారు. కానీ బాడీలోంచి చెమట విపరీతంగా వచ్చి అలా దుర్వాసన వస్తుంది. ఇలా ఓవర్‌ స్వెట్టింగ్‌ సమస్య ఉన్నవారు, నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు వెల్లుల్లిని పక్కన పెట్టడం మంచిది. దీని వల్ల ఇంకా అధ్వానంగా వాసన వస్తుందట..

ఎసిడిటీ ఉంటే..

యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నట్లయితే వెల్లుల్లిని తినకూడదని వైద్యులు అంటున్నారు. అలాంటి వారికి వెల్లుల్లి తింటే గుండెల్లో మంట వస్తుంది. ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ఖాళీ కడుపుతో వెల్లుల్లితో చేసిన వంటలను కూడా తినకూడదు

మందులు వాడుతుంటే..

కొన్ని రకాల మెడిసిన్స్‌ తీసుకుంటే కాస్త వెల్లుల్లి తగ్గించడం మంచిది. వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు, అది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే మందులతో సమస్య వస్తుంది. రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుందట..

శస్త్రచికిత్స చేయించుకునే ముందు..

త్వరలో ఏదైనా సర్జరీ చేయించుకోబోతుంటే.. వెల్లుల్లిని పక్కన పెట్టాల్సిందే.. వెల్లుల్లి రక్తస్రావాన్ని కలిగిస్తుంది. రక్తపోటును పెంచుతుంది. వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. శస్త్రచికిత్సకు కనీసం రెండు వారాల ముందు మీరు వెల్లుల్లిని తీసుకోవడం మానేయడం ఉత్తమం. ఫుడ్‌ అలర్జీ ఉన్నవాళ్లు కూడా వెల్లుల్లిని మానేయాలని వైద్యులు అంటున్నారు. సో.. మీకు పైన చెప్పిన సమస్యలు ఏమైనా ఉంటే.. చూసుకోండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news