నల్ల క్యారెట్‌ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. బరువు తగ్గాలంటే తినాల్సిందే..!!

-

క్యారెట్‌ ఆరోగ్యానికి అందానికి చాలా మంచి కూరగాయని మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అయితే క్యారెట్‌లో రెడ్‌ కలర్‌దే మనకు తెలుసు..బ్లాక్‌ క్యారెట్‌ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? బ్లాక్‌ క్యారెట్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఈ సీజన్‌లో బ్లాక్‌ క్యారెట్‌ తినడం వల్ల బరువు ఈజీగా తగ్గొచ్చుట.. ఇంకా ఈ బ్లాక్‌ క్యారెట్‌ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దామా..!
ఆరెంజ్ క్యారెట్ కంటే బ్లాక్ క్యారెట్ చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దీని తీపి కూడా బాగుంటుంది. నల్ల క్యారెట్ తిన్న తర్వాత, దాని రుచి చాలాసేపు నోటిలో ఉంటుంది. నల్ల క్యారెట్‌లో ఫైబర్, పొటాషియం, విటమిన్ ఏ, బీ, సీ, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. .

బ్లాక్ క్యారెట్‌లో ఆంథోసైనిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

బ్లాక్ క్యారెట్.. రక్తాన్ని శుభ్రపరచి మలినాలు తొలగించడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

క్యారెట్ జ్యూస్ శరీరంలో రక్త పరిమాణాన్ని పెంచుతుంది.

బ్లాక్ క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

నల్ల క్యారెట్ మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట, అలసట, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేస్తుంది.

బ్లాక్ క్యారెట్‌లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

నల్ల క్యారెట్ మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం, గుండెల్లో మంట, అలసట, విరేచనాలు వంటి వ్యాధులను నయం చేస్తుంది.

బ్లాక్ క్యారెట్‌లోని విటమిన్ సీ.. రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది.

ఇది బయటి నుంచి సోకే ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

బ్లాక్ క్యారెట్‌లోని విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.

బ్లాక్‌ క్యారెట్ కళ్లకు మేలు చేస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కళ్ల అద్దాల వాడకం తగ్గే అవకాశం ఉంది.

బ్లాక్ క్యారెట్ తినడం అల్జీమర్స్ నుండి రక్షించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యారెట్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు ఆంథోసైనిన్ భాగాలు ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

బ్లాక్ క్యారెట్‌కు క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఉంది.

నల్ల క్యారెట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్యఔషధంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news