ఈ 4 ఆహారపదార్దాలని వేడి చేసి తింటే సమస్యలే…!

-

మిగిలిపోయిన ఆహారాన్ని ఆదా చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు నచ్చిన ఆహార పదార్థాలను మళ్ళీ మళ్ళీ మీరు వేడి చేసి తీసుకుంటే సమస్యలు వస్తాయి. అసలు ఈ ఆహార పదార్థాలని వండిన తర్వాత మళ్ళీ వేడి చేయకండి. వీటిని వేడి చేసి తినడం వలన లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అయితే ఎటువంటి ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తీసుకోకూడదు అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెప్పారు మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

బంగాళదుంపలు:

బంగాళదుంపలని అస్సలు మళ్ళీ వేడి చేయకండి ఒకసారి వాడిన తర్వాత బంగాళదుంపల్ని మళ్ళీ వేడి చేయడం వలన అది పాయిజన్ గా మారే అవకాశం ఉంది వేడి చేసి తీసుకుంటే బ్యాక్టీరియా వస్తుంది.

అన్నం:

మిగిలిపోయిన అన్నం అసలు వేడి చేయకూడదు. దీని వలన ఏమవుతుంది అంటే ఇది బ్యాక్టీరియాకు కారణంగా మారిపోతుంది. కాబట్టి మిగిలిన అన్నం వేడి చేయకండి ఒకవేళ వేడి చేయాలనుకుంటే రూమ్ టెంపరేచర్ లో ఉండేటట్టు చూసుకోండి.

చికెన్:

అదేవిధంగా చికెన్ ని కూడా మీరు మళ్లీ వేడి చేసి తీసుకోవడం మంచిది కాదు చాలామంది మిగిలిన చికెన్ ని ఫ్రిజ్లో పెడతారు ఆ తర్వాత దానిని తీసి మైక్రోవేవ్ లో వేడి చేస్తారు. ఇలా చేయడం వలన ప్రోటీన్స్ మారిపోతాయి. కడుపులో సమస్యలు వస్తాయి. మీరు ఏదైనా ఆహార పదార్థాన్ని వండి అది మిగిలిపోతే మరుసటి రోజు కూడా అలానే తీసుకోవాలి తప్ప మీకు నచ్చిన విధంగా చేయకూడదు. ఒకవేళ వేడి చేయాలని మీరు అనుకుంటే చిన్న మంట మీద కొద్దిగా వేడి చేయండి కానీ ఈ తప్పులను మాత్రం చేయొద్దు.

గుడ్లు:

గుడ్లని కూడా మళ్లీ వేడి చేసి తీసుకోకూడదు మిగిలిపోయిన గుడ్లని అసలు ఉంచకండి ఎందుకంటే ఇది టాక్సిన్ ని విడుదల చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news