మీ వంటనూనె హానికర రసాయనంతో కల్తీ అయ్యిందా? ఈ విధంగా తెలుసుకోండి.

వంటనూనెల గురించి మాట్లాడగానే వాటి ధరల ప్రస్తావన వస్తుంది. కరోనా మొదటి వేవ్ తర్వాత వాటి ధరలు అమాంతం 80నుండి 90శాతానికి పెరిగాయి. సామాన్యులకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వీటి రేట్లు కొద్దిగా తగ్గాయి. ఈ తరుణంలో నూనెగింజల ఉత్పత్తి విషయమై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. అదలా ఉంచితే సామాన్యుడి గుండెకు చిల్లు పడేలా ఉన్న ధరలతో వంటనూనెలు తెచ్చుకుంటే అందులో జరిగే కల్తీ సామాన్యుడి ప్రాణాలు తీసుకుంటుంది.

 

oil

మీరు ఉపయోగించే వంటనూనె కల్తీ అయ్యిందా? అందులో ట్రై ఆర్థో క్రిసెల్ ఫాస్పేట్ కలిసిందా? వంటనూనెలో సులభంగా కలిసిపోయి, నూనె రుచిని ఏమాత్రం మార్చని ఈ రసాయనం మీరు వాడుతున్న వంటనూనెతో కలిసిపోయిందా అనేది ఒక చిన్న టెస్టు ద్వారా తెలుసుకోవచ్చు.

ఈ రసాయనం కలవడం వల్ల మొదట వాంతులు, డయెరియా కలుగుతుంది. అది కొనసాగి మూర్చపోయే పరిస్థితికి దారి తీయవచ్చు. అందువల్ల వంటనూనెల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ప్రస్తుతం భారతదేశ ఆహార ప్రమాణాల సంస్థ తెలిపిన ప్రకారం మీ వంట నూనెలు ట్రై ఆర్థో క్రిసెల్ ఫాస్ఫేట్ తో కల్తీ అయ్యాయో లేదో ఈ విధంగా తెలుసుకోండి.

పద్దతి

రెండు మిల్లీ లీటర్ల నూనెను ఒక గ్లాసులో తీసుకోండి.
దానికి చాలా తక్కువ పరిమాణం గల పసుపు రంగులో ఉన్న వెన్న కలపండి.
అప్పుడు కల్తీ లేని వంటనూనె రంగు ఏమాత్రం మారదు. అదే కల్తీ అయిన వంటనూనె రంగు ఎరుపు రంగులోకి మారుతుంది.

అందువల్ల మీ వంటిల్లును సురక్షితంగా ఉంచడానికి ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది. మీ వంటిల్లు సురక్షితంగా ఉంటే మీరు సురక్షితంగా ఉన్నట్టే.