ఇంటి భోజనానికి ప్రాధాన్యత… వంటింట్లో సేఫ్టీ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..

-

ప్రపంచ ఆహార సురక్షిత దినోత్సవాన్ని జూన్ 7వ తేదీన జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహారం, సురక్షణ విభాగం ఈ తేదీని నిర్ణయించింది. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే సురక్షిత ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం నడుస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ఇది చాలా అవసరం కూడా. కిచెన్లో శుభ్రత, ఆహార సురక్షణ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చేతులు కడుక్కోవాలి

చిన్న చిన్న చర్యలే ఆరోగ్యాన్ని అందిస్తాయి. బయట నుండి ఇంటికి వచ్చిన ప్రతీసారీ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఆహారం భుజించేముందుగానీ, కూరగాయలు కోయడం, వంట వండే ముందు గానీ చేతులు శుభ్రం చేసుకోవాలి.

ఫ్రిజ్ నింపేయవద్దు

లాక్డౌన్ కారణంగా ఊరికే బయటకు వెళ్ళడం కుదరదు కాబట్టి, ఒకేసారి అన్ని సరుకులు తెచ్చుకుని ఫ్రిజర్ లో పెట్టేస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఫ్రిజ్ నింపేస్తే దాన్లో గాలి వెళ్ళకుండా ఉంటుంది. అప్పుడు అది ఫ్రిజ్ ఉష్ణోగ్రతని ప్రభావితం చేస్తుంది.

ఎక్స్పైరీ డేట్ గమనించండి

చాలా రోజులుగా నిల్వ ఉంటున్న ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించండి. ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. అది గమనించకుండా ఆహారాన్ని ముట్టుకోవద్దు.

పాడైపోయే వస్తువులను తెలుసుకోండి

కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తొందరగా పాడైపోతాయి. అలాంటి వాటిని ఫ్రిజ్ లో పెట్టినపుడు రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి. లేదంటే అవి పాడైపోవడమే కాకుండా ఇతర పదార్థాలను పాడైపోయేలా చేస్తాయి.

పాత్రల శుభ్రత

ఆహారం ఎంత బాగా రుచిగా ఉందనేది దానికి ఎలాంటి పాత్ర వాడావన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారాన్ని వండే పాత్రలని శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిని నీటితో శుభ్రం చేస్తూనే రసాయనాలతో సూక్ష్మక్రిములను చంపేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news