హోమ్ మేడ్ పాస్తా ఇలా చేసేయండి.. బయట చేసేవాటికంటే ఎన్నోరెట్లు మంచిది..!

-

పాస్తా అంటే పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరికీ ఇష్టం ఉంటుంది. ఇది రుచిగా ఉంటుంది.. చేయడం కూడా త్వరగా అయిపోతుంది. కానీ మనకు ఇలాంటివి మంచివి కావని తెలుసు.. కానీ మనసాగక తింటూనే ఉంటాం.. ఒకవేళా ఇంట్లోనే పాస్తా చేసుకుంటే.. అది ఇంకా టేస్టీగా ఉంటే.. అబ్బ ఇంకేంటి.. హ్యాపీగా తినేయొచ్చు.. అయితే ఇంకెందుకు లేట్ మమ్మీస్.. హోమ్ మేడ్ పాస్తా ఎలా తయారుచేయాలో చూసేద్దామా.. మీ పిల్లలకు ఇది చేసిపెట్టేయండి..!

హోమ్ మేడ్ పాస్తా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

మల్లీగ్రెయిన్ పిండి అరకప్పు
పుల్లమజ్జిగ ఒక కప్పు
క్యాబేజీ స్లైసెస్ అరకప్పు
క్యారెట్ స్లైసెస్ అరకప్పు
క్యాప్సికమ్ స్లైసెస్ అరకప్పు
టమోటా ముక్కలు అరకప్పు
స్వీట్ కాన్ గింజలు అరకప్పు
ఒరిగానో హెర్బ్ ఒక టేబుల్ స్పూన్
టమోటా సాస్ ఒక టేబుల్ స్పూన్
మిరియాలపొడి ఒక టీ స్పూన్
ఎండుమిరపకాయలు ముక్కాచెక్కగా చేసినది ఒక టీ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
పార్స్లీ కొద్దిగా
పుదీనా కొద్దిగా

తయారు చేసే విధానం..

ముందుగా మనం తీసుకున్న మల్టీగ్రెయిన్ పిండిని బౌల్ లో వేసేసి అందులో లెమన్ జ్యూస్, పుల్లమజ్జిగా వేసి పుల్కా పిండిలా కలుపుకుని.. ఉండలు చేసుకుని చపాతీల చేసుకుని.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఆ ముక్కలు మధ్యలో ప్రెస్ చేస్తే..x షేప్ లో వస్తాయి. వీటిని ఆవిరిలో ఉడికించండి. పొయ్యిమీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మీగడ వేసి.. ఎండుమిరపకాయలు ముక్కాచెక్క చేసినవి, ఒరిగానో హర్బ్, మిరియాల పొడి, క్యారెట్ స్ల్సైస్, క్యాప్సికమ్ స్లైసెస్, క్యాబేజీ స్లైసెస్, టమోటా ముక్కలు, స్వీట్ కాన్ గింజలు వేసి దోరగా వేగనివ్వండి. 5-7 నిమిషాలు ఉంచితే చాలు.. ఆ తర్వాత అందులో పార్ల్సీ ఆకు, పుదీనా వేసి కలపి.. ఆవిరిలో ఉడికించుకున్న పాస్తవేసి, టమోటా సాస్, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి బాగా కలపి దించేయండి.. అంతే హోమ్ మేడ్ పాస్తా రెడీ. ఆరోగ్యానికి ఏమాత్రం హాని లేని విధంగా అందరూ తినొచ్చు. పిల్లలు పెట్టినా.. ఇష్టంగా తింటారు. హెల్తీగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news