తల్లులు కచ్చితంగా ఈ 10 ఆహారపదార్దాలని తీసుకోవాలి.. ఎందుకు అంటే..?

-

తల్లులు: ఇంటిని నడిపించేది స్త్రీలే. కనుక ముందు స్త్రీలే ఆరోగ్యంగా ఉండాలి చాలామంది మహిళలు అనారోగ్య సమస్యలు వున్నా కూడా బయటకు చెప్పకుండా వాళ్ళ పనులు చేసేస్తూ ఉంటారు అయితే నిజానికి వాళ్లు ఆరోగ్యంగా ఉండకపోతే ఇంట్లో వాళ్లకు కూడా ఇబ్బంది వస్తుంది. పైగా వాళ్ళ ఆరోగ్యం బాగోకపోతే ఏ పని చేయడానికి ఎవ్వడు. ఇంట్లో పనులు అలానే నిలిచిపోతాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్య మంచి ఆహార పదార్థాలు ని డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

నెయ్యి, నువ్వులు, మునగాకు, గుడ్లు, చియా సీడ్స్, యోగర్ట్ వంటివి తీసుకుంటే ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వులేని స్నాక్స్ వంటి వాటిలో యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. నెయ్యిని తీసుకోవడం వలన పోషకాలు బాగా అందుతాయి రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. నెయ్యి బటర్ వేసుకుని మనం చాలా రకాల వంటకాలని తయారు చేసుకోవచ్చు. మునగ లో ఐరన్ ఎక్కువ ఉంటుంది మునగ తీసుకుంటే ఐరన్ లెవెల్స్ ని పెంచుకోవచ్చు. అలానే ప్రోటీన్స్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ కూడా ఉంటాయి.

అవిసె గింజల్ని తీసుకుంటే క్యాల్షియం బాగా అందుతుంది ముఖ్యంగా పాలిచ్చే తల్లులు అవిసె గింజలు తీసుకుంటే క్యాల్షియం ఐరన్ పొందొచ్చు. క్వినోవని కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. యోగర్ట్ లో ప్రోబయాటిక్స్ బాగా ఉంటాయి గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు తీసుకుంటే మరింత మేలు కలుగుతుంది. గుడ్లు చిలగడ దుంపలు దానిమ్మ పండ్లను కూడా డైట్లో చేర్చుకోండి ఆల్మండ్ బటర్ ని కూడా తీసుకోండి.

ఆల్మన్డ్ బటర్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఆల్మన్డ్ బెటర్ మంచి కొలెస్ట్రాల్ ని పెంపొందిస్తుంది కూడా. పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. అలానే దానిమ్మ పండ్లను తీసుకుంటే పోషకాలు అందుతాయి కూడా. ఇలా మంచి పోషకాహారాన్ని రోజు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. తల్లులు కచ్చితంగా ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకూడదు ఆరోగ్యం బాగుండాలంటే వీటన్నిటిని డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి అప్పుడే ఏ సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news