చికెన్ హార్ట్ ఫ్రై తిన్నారా ఎప్పుడైనా? ఆ మ‌జాయే వేరు

-

చికెన్ హార్ట్ ఫ్రై… తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. స్టఫ్ గా కూడా సూపర్బ్ గా పనిచేస్తుంది చికెన్ హార్ట్ ఫ్రై. అన్నంలో కాకుండా… ఈ ఫ్రైని అలాగే తినేయొచ్చు. లేదంటే.. రోటీ, మిగితా వంటకాలతో కలిపి కూడా తినొచ్చు. ఏవైనా డ్రింక్స్ తాగుతూ కూడా చికెన్ హార్ట్ ఫ్రైని లాగించేయొచ్చు. మరి… ఘుమఘుమలాడే చికెన్ హార్ట్ ఫ్రైని ఎలా తయారు చేయాలో తెలుసా?

చికెన్ హార్ట్ ఫ్రై కోసం ఫ్రెష్ చికెన్ గుండెకాయలు, కార్జాలు(లివర్) తీసుకోండి. నాలుగు ఎగ్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, నూనె ఉంటే చాలు.. చికెన్ హార్ట్ ఫ్రైని వండేయొచ్చు.

ముందుగా చికెన్ గుండెకాయలు, లివర్ ను చిన్ని చిన్న ముక్కలుగా కోయండి. తర్వాత వాటర్ పోసి వాటిని కడగండి. పొయ్యి మీద గిన్నె పెట్టి… కొంచెం నూనె పోసి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేయండి. కాసేపు వేగేదాకా ఆగండి. తర్వాత చికెన్ గుండెకాయలు, లివర్ వేసి బాగా వేయించండి. అవి గట్టి పడేవరకు వేయించండి. గుండెకాయలు వేయగానే పసుపు, కారం, ఉప్పు వేయండి. అవి వేగాక… అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ వేయండి. కాసేపు వేగాక స్టౌ కట్టేయండి.

మరోవైపు గుడ్లను ఉడకబెట్టి.. వాటి పొట్టు తీసి.. వాటిని నూనెలో వేయించి.. రౌండ్ గా కట్ చేసి… ఉడికిన చికెన్ హార్ట్స్ ఫ్రై పైన గార్నిష్ చేయండి. కొంచెం కొత్తిమీర కూడా దాని మీద చల్లండి. అంతే.. వేడి వేడి చికెన్ హార్ట్ ఫ్రై రెడీ.

Read more RELATED
Recommended to you

Latest news