పాల తాలికలు ఎలా చేసుకోవాలి

-

కావలసినవి:

బియ్యప్పిండి – ఒక కప్పు;

బెల్లం తురుము – అర కప్పు;

పంచదార – అర కప్పు;

నెయ్యి – ఒక చెంచా;

ఏలకుల పొడి – పావు టీ స్పూన్

తయారీ:

ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు మరిగించి దించాలి. అందులో బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా కలిపి మూత పెట్టి పది నిమిషాల సేపు పక్కన పెట్టాలి.

ఈ లోపు మరొక గిన్నెలో పాలను మరిగించాలి. ఇప్పుడు చేతులకు నెయ్యి రాసుకుని వేడినీటితో తడిపిన బియ్యప్పిండి కొద్దిగా తీసుకుని అర చేతుల మధ్య మృదువుగా రుద్దితే పొడవుగా తాలికలుగా వస్తుంది. వీటిని వెడల్పుగా ఉన్న పళ్లెంలో వేసి పది నిమిషాల సేపు ఆరనివ్వాలి.

ఆరిన తర్వాత తాలికలను మరుగుతున్న పాలలో వేసి (తాలికలు ఒకదాని మీద ఒకటి పడి అతుక్కుపోకుండా జాగ్రత్తగా వదలాలి) ఉడికించాలి. తాలికలు ఉడికిన తర్వాత బెల్లం తురుము, పంచదార వేసి కలుపుతూ మరికొంత సేపు మరిగించాలి.

పాలు చిక్కపడిన తర్వాత యాలకుల పొడి వేసి కలిపి దించాలి. ఇష్టమైతే జీడిపప్పు, బాదం, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version