ఆదివారం ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో తెలుసా..!!!

-

పూర్వం ఇళ్ళలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరియాక పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు.ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనే వారు. ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చే వారు కాదు. వారికి కూడా వివరం తెలియక పోయిన సరే తమ తల్లి తండ్రుల నుంచీ వస్తున్న నియమాలని పాటించేవారు. కానీ ప్రస్తుతం కొందమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు. అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న. అందుకే ఆ నియమం లో దాగివున్న అర్ధాన్ని మీ ముందు ఉంచుతున్నాం.

sundays why shouldnt we Eat Amla

ఆదివారం రోజు, రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే.. ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు. అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రి పూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది.

అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు. ఉసిరి కాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్య శక్తి దాగి ఉంటుంది. సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది. అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడుతారు. మరుసటి రోజు అదే ఫలాని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇది సైన్స్ తో కూడిన దివ్య రహస్యం..

Read more RELATED
Recommended to you

Latest news