స్వీట్ పొంగల్ ను ఇలా చేస్తే అస్సలు వదలరు..

-

స్వీట్ పొంగల్…దేవుడికి నైవెద్యంగా పెడతారు.గుడిలో పెట్టె కొద్దిగా ప్రసాదం అయిన చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచితో వండటం చాలా మందికి రాదు.సరైన కోతలతో చేస్తే అదే రుచితో మనము కూడా చేసుకొవచ్చు..ఇప్పుడు మనం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

సన్నని బియ్యం,
కొంచెం పెసరపప్పు,
ఒక కప్పు పాలు,
బెల్లం పొడి,
కొన్ని నీళ్లు,
నెయ్యి, జీడిపప్పు,
బాదం, కిస్మిస్,
కొన్ని లవంగాలు,
యాలకుల పొడి

తయారీ విధానం:

పెసరపప్పును ఒక పాన్ పెట్టి కొంచెం ఎర్రగా అయ్యే వరకు కాసేపు వేయించండి. ఆ తర్వాత బియ్యాన్ని తీసుకొని.. బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా కడగండి. కుక్కర్ లో కడిగిన బియ్యం, ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు, కొన్ని పాలు, బియ్యానికి సరిపడా నీళ్లు పోసి ఒక స్పూన్ నెయ్యి వేసి ఓ నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఇంతలో ఓ పాన్ తీసుకొని నీళ్లు పోసి బెల్లం వేసి పాకం పట్టండి. అన్నం ఉడికిన తర్వాత బెల్లం పాకాన్ని దాంట్లో వేసి ఇంకొంచెం నెయ్యి వేసి కొంచెం సేపు ఉడికించండి. ఇంతలో మరో పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ను వేయించండి. వాటిని ఉడికిన అన్నంలో వేసి లవంగాలు, యాలకుల పొడి వేసి ఆ మిశ్రమాన్ని కలిపి స్టౌ ఆఫ్ చెయ్యండి.. అంతే ఎంతో రుచికరమైన పొంగల్ రెడీ..

Read more RELATED
Recommended to you

Latest news