మందు తాగేటపుడు మంచింగ్ కోసం ఈ పదార్థాలని ఆహారంగా తీసుకోవద్దు..

Join Our Community
follow manalokam on social media

పార్టీ అంటే చాలు మందు తాగడమే అని అందరికీ అలవాటైపోయింది. మందు లేకుండా పార్టీ జరగనే జరగదు. అంతలా మందుకి అలవాటు పడ్డారు జనం. మందు తాగడం గురించి ఎవరికీ పట్టింపు లేదు కానీ, మందు తాగేటప్పుడు మంచింగ్ కోసం తినే పదార్థాల మీదే అందరికీ అనుమానం. మందు తాగేటపుడు కారంగా ఉన్న పదార్థాలని తీసుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరు పండ్లు తినడానికి ఆసక్తిగా ఉంటారు. ఐతే మందు తాగేటపుడు తీసుకోకూడని పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

పాల పదార్థాలు

ఏదో ఒక సినిమాలో మందులో పాలు కలుపుకుని తాగడం చూసాం. కానీ అది అస్సలు మంచి పద్దతి కాదు. మందులో పాలు కలుపుకోవడమ్ పక్కన పెడితే పాల పదార్థాలు మంచింగ్ కి తినకూడదు. కొందరికి జున్ను తినే అలవాటు ఉంటుంది. ఇలా తింటే జీర్ణక్రియ దెబ్బతిని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

నూనెలో వేయించిన పదార్థాలు

మిర్చి బజ్జీ, చిప్స్ వంటి పదార్థాలని మంచింగ్ గా తినకూడదు. వీటిల్లో గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల దాహం ఎక్కువ వేస్తుంది. అందువల్ల మద్యం తాగేటపుడు నూనెలో వేయించిన పదార్థాలకి ఫుల్ స్టాప్ పెట్టండి.

జీడిపప్పు

చాలా మంది మద్యానికి మంచింగ్ లోకి జీడిపప్పు మంచిదని అనుకుంటారు. ఇది కూడా సినిమాల్లో చూపించిందే. కానీ అది ఎంతమాత్రం కాదు. జీడిప్పప్పులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కొవ్వు శాతం ఎక్కువగా ఉన్న ఏ పదార్థాలని తీసుకున్నా ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటివల్ల గుండెకి సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...