మనం తీసుకునే ఆహారంపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఏ ఆహారం ఏ సమయంలో తీసుకుంటున్నామనేది కచ్చితంగా జాగ్రత్తగా గమనించండి. లేకపోతే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నారింజ ఆరోగ్యం చాలా మంచిది. ఇందులో సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. నారింజ లో విటమిన్ సి కూడా అధికంగాఉంటుంది.నారింజని తింటే కఫ, వాత వంటి సమస్యలు దూరం అయిపోతాయి మూత్ర విసర్జన ప్రక్రియను కూడా ఇది ఈజీ చేస్తుంది. నారింజని తీసుకుంటే ఏం అవుతుంది..? పరగడుపున తీసుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నారింజ తో ఈ సమస్యలు దూరం:
జీర్ణ సమస్యలు వుండవు:
చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జ్వరాల బారిన పడినప్పుడు జీర్ణశక్తి తగ్గుతుంది అటువంటి సమయంలో నారింజ ని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది:
నారింజ తీసుకుంటే ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు. విష క్రిములు చేరకుండా ఇది చూస్తుంది.
బీటా కెరోటిన్ ఉంటుంది:
బీటా కెరోటిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ దీనిలో ఉంటుంది ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
రక్త ప్రసరణ మెరుగుపడుతుంది:
నారింజని తీసుకుంటే రక్తప్రసరణ మెరుపు పడుతుంది కూడా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఇది సహాయం చేస్తుంది.
జలుబు దగ్గు ఉండవు:
నారింజని తీసుకోవడం వలన జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి నారింజ పొడి చేసి దీనిని ఒంటికి పట్టిస్తే నిగారింపు మీ సొంతమవుతుంది. చాలా మంది ముఖానికి రాసుకుంటూ ఉంటారు. మీరూ అందంగా మారాలంటే ఈ టిప్ ని కూడా ట్రై చేయొచ్చు.
నారింజని పరగడుపున తీసుకోవచ్చా..?
నారింజని పరగడుపున అసలు తీసుకోకండి పరగడుపున తీసుకుంటే ఎసిడిటీ అల్సర్ వంటి సమస్యలు వస్తాయి.