హీరోయిన్ ఆకాంక్ష సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ప్రధానంగా హిందీ మరియు తెలుగు చిత్రాలలోనే నటిస్తోంది. హీరోయిన్ ఆకాంక్ష సింగ్ తన కెరీర్‌ను థియేటర్‌తోనే ప్రారంభించింది.
టెలివిజన్ ధారావాహిక “నా బోలే తుమ్ నా మైనే కుచ్ కహా (2012) మరియు బద్రీనాథ్ కి దుల్హనియా (2017)తో ఆకాంక్ష సింగ్ సినీ ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసింది. ఇక “మళ్లీ రావా” (2017) సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది ఆకాంక్ష సింగ్.
ఈ సినిమాలో నటించిన ఆకాంక్ష సింగ్ కు SIIMA అవార్డు కూడా వచ్చింది. ఇక కన్నడలో పైల్వాన్ (2019)తో మరియు తమిళంలో క్లాప్ (2022)తో అరంగేట్రం చేసింది ఆకాంక్ష సింగ్.
ఇటీవల పరంపర అనే వెబ్ సిరీస్‌తో తెలుగులోమరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా వైట్ డ్రెస్ లో తన అందాలను ఆరబోసింది ఆకాంక్ష సింగ్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.