Taapsee Pannu : నడుం హొయలు చూపిస్తూ.. చీరకట్టులో తాప్సీ వయ్యారాలు

-

తాప్సీ పన్ను.. ఈ దిల్లీ డాల్ ప్రస్తుతం బాలీవుడ్​లో బిజీ హీరోయిన్. అక్కడ వరుస సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతోంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి సినీ అరంగేట్రం చేసిన తాప్సీ.. ఇక్కడ అవకాశాలు వస్తున్నా బీ టౌన్​కు వెళ్లింది. ఇక అక్కడ కంటెంట్ ఓరియెంటెడ్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అరంగేట్రం టాలీవుడ్​లో చేసినా.. ఈ భామ తరచూ సౌత్ ఇండస్ట్రీపై విమర్శలు చేస్తూనే ఉంటుంది.

తాప్సీ సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. ఈ భామ తాజాగా చీరకట్టులో ఫొటోలు షేర్ చేసింది. ఎప్పుడూ ట్రెండీగా కనిపించే ఈ బ్యూటీ చీరకట్టులో కనిపించే సరికి అభిమానులు ఖుష్ అవుతున్నారు. గ్రీన్ కలర్ శారీలో తాప్సీ మల్లెతీగలా అందంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజులో.. తలలో గులాబీ పూవు పెట్టుకుని కుందనపు బొమ్మలా ఉంది. నడుం వొంపులు చూపిస్తూ తాప్సీ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.

చీరకట్టులో తాప్సీని చూసిన కుర్రాళ్ల గుండె జారి గల్లంతయింది. ఇంత వయ్యారంగా ఈ భామను ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంత అందం, టాలెంట్​ బాలీవుడ్​కి వెళ్లిపోయిందని ఫీల్ అవుతున్నారు. హేయ్ దిల్లీ డాల్.. త్వరగా టాలీవుడ్​కు వచ్చేసేయ్ అంటూ సోషల్ మీడియాలో తెగ రిక్వెస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version