టీతో రస్క్‌ తింటున్నారే.. అయితే రిస్క్‌..!

-

ఉదయం, సాయంత్రం టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. టీ తాగడమే నిజానికి ఒక చెడ్డ అలవాటు.. కానీ ఏం చేస్తాం అదొక ఎడిక్షన్‌.. అలసటగా అనిపించినా, తలనొప్పిగా ఉన్నా ముందు టీనే తాగాలనిపిస్తుంది. అయితే అందరూ టీ తాగేప్పుడు.. బిస్కెట్లు, రస్క్‌లు నంచుకోని తాగుతూ ఉంటారు. ఇలా తినడం వల్ల కడుపునిండినట్లు ఉంటుంది కానీ..నష్టాలు చాలా ఉన్నాయి.. ఉదయం పరగడుపున టీతో రస్క్ తినడమంటే చాలామందికి ఇష్టమే. కొంతమంది ఇతర సమయాల్లో సైతం తింటుంటారు. కానీ ఈ అలవాటు ఏ మాత్రం మంచిది కాదు. మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది.
రస్క్ తినడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రస్క్ రిఫైండ్ పిండితో తయారవుతుంది. ఇందులో పంచదార అధికంగా ఉంటుంది. అంతేకాదు రస్క్ తయారీలో ఉపయోగించే నూనె కూడా నాణ్యమైంది కాదు.. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. రస్క్‌లో రిఫైండ్ గోధుమ పిండి లేదా మైదా వాడతారు…దాంతోపాటు ఇందులో నూక, రిఫైండ్ ఎడిబుల్ ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, ఫుడ్ ఎడిక్టివ్స్, ప్రిజర్వేటివ్స్ వంటివి కలుస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు.. అందుకే రోజుకు కేవలం రెండు రస్కులు తిన్నా ఇది మీ కొంప ముంచుతుంది.

రస్క్ తినడం వల్ల కలిగే నష్టాలు..

టీతో పాటు టోస్ట్ తినడం గుండె ఆరోగ్యంపై దెబ్బతింటుంది.. ఎందుకంటే ఇందులో రోగాల్ని పెంచే కారకాలుంటాయి. ముఖ్యంగా గుండె వ్యాధి ముప్పు పెరుగుతుంది. అసలే ఈరోజుల్లో గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఘోరంగా పెరిగిపోయింది. కరోనా అయినా వచ్చాక వారం రోజులు టైమ్‌ ఇస్తుంది.. కానీ గుండెపోటు వచ్చిందంటే అంతే.. క్షణాల్లో అంతా అయిపోతుంది.
మీకు రోజూ టీ, రస్క్ తినే అలవాటుంటే త్వరగా అది మానేయండి. ఎందుకంటే దీనివల్ల ప్రేగుల్లో అల్సర్ సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, జీర్ణం సరిగ్గా లేకపోవడం వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి.. కాబట్టి ఈ అలవాటును త్వరగా మానుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news