ఉదయాన్నే ఇలా ఉంటే షుగర్ ఉన్నట్టే…?

-

ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య షుగర్. షుగర్ తో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పైగా చాలా మందికి షుగర్ వచ్చినా సరే తెలియడం లేదు కానీ కొన్ని సంకేతాల ద్వారా మనం ఈజీగా షుగర్ ని గుర్తించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒకవేళ కనుక రక్తం లో చక్కెర స్థాయిలు లీటర్‌కి నాలుగు మిల్లీమోల్స్ కంటే తక్కువగా ఉంటే లక్షణాలు కనబడతాయని డాక్టర్లు అంటున్నారు. ఈ లక్షణాలు కనుక మీలో కలిగినట్లయితే కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

 

ఆకలి ఎక్కువ వేయడం, వణుకు, చెమట వంటి సంకేతాలు కనబడతాయి. ఇటువంటివి కనక కనపడితే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోకండి. అలానే షుగర్ కనుక ఉన్నట్లయితే నోరు పొడిగా మారిపోతుంది. నోరు పొడిగా మారినట్లయితే కచ్చితంగా రక్తం లో చక్కెర స్థాయిలలో మార్పు వచ్చిందని నిద్రలేచిన వెంటనే నోరు ఆరిపోయినట్లు దాహంగా ఉంటుంది ఇలా కనుక మీకు అనిపిస్తే షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకోండి.

అలానే తరచూ వికారంగా ఉంటుంది అలానే ఇతర లక్షణాలు కూడా ఉంటాయి కంటే చూపు సమస్యలు కూడా ఎదురవుతాయి. ఉదయం లేవగానే సరిగా కళ్ళు కనపడకపోవడం కనుక జరిగితే షుగర్ లెవెల్స్ ని చూసుకోండి. క్లియర్ గా కనపడదు. దృష్టి అస్పష్టంగా ఉంటుంది. ఒకవేళ కనుక చెక్కర లెవెల్స్ సరిగ్గా ఉన్నట్లయితే మళ్లీ బాగా కనపడుతుంది. ఎక్కువ బ్లడ్ షుగర్ వలన నరాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్లు పాదాలలో నరాలపై ప్రభావం పడుతుంది. అలసట కూడా షుగర్ ఉన్న వాళ్ళలో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news