బరువు తగ్గడానికి ఈ పదార్ధాలకి బదులుగా వీటిని తీసుకుంటే సరిపోతుంది..!

-

ఈ మధ్యకాలంలో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా బరువు పెరిగిపోవడం చాలా పెద్ద సమస్యగా మారింది. చాలా మంది బరువు ఎక్కువగా ఉన్నారని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదు. అయితే అటువంటి వాళ్ళు ఈ చిన్నచిన్న ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరిస్తే మంచిది.

 

weight loss
weight loss

మనం తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని వాటికి బదులుగా ఇతర పదార్థాలను తీసుకోవడం మంచిది. అయితే ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు..?, ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసమే పూర్తిగా చూసేయండి.

పంచదారకు బదులుగా బెల్లం:

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎనిమియా సమస్యను కూడా ఇది తరిమికొడుతుంది. కానీ పంచదార వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు తీసుకొనే డైట్ లో పంచదారకు బదులుగా బెల్లాన్ని తీసుకోండి.

చల్ల నీళ్లు కి బదులుగా గోరువెచ్చని నీళ్లు:

మనం తీసుకునే నీళ్ళల్లో చాలా క్రిములు ఉంటాయి అదేవిధంగా చల్ల నీళ్లు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి గోరువెచ్చని నీళ్లు రోజు తాగండి. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కూర్చోడానికి బదులుగా కాసేపు నడవడం:

ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు వ్యాయామం కోసం సమయం కేటాయించాలి. ఇలా మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

పండ్ల రసాలకు బదులుగా పండ్లు:

పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు చెయ్యవు. దాని బదులు మీరు పండ్లు తింటే ఫైబర్ తో పాటు ఇతర పోషక పదార్థాలు కూడా అందుతాయి. కనుక పండ్ల రసాలు కి బదులుగా మీరు పండ్లు తీసుకోండి.

రాత్రి ఎక్కువ ఆహారానికి బదులుగా లైట్ గా తీసుకోవడం:

రాత్రి పూట ఆలస్యం తినడం, ఎక్కువగా తినడం మంచిది కాదు. దానికి బదులుగా మీరు త్వరగా లైట్ గా తీసుకోవడం మంచిది. ఇలా ఈ మార్పులు చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. సమస్యలు కూడా తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news