అతి నిద్రతో అన్నీ సమస్యలే.. ఉదయం లేట్‌గా లేస్తున్నారా..?

-

నిద్ర సుఖమెరగదు అంటారు.. సరిగ్గా నిద్రలేకపోతే…కాస్త కునుకుతీసే టైమ్ వస్తే చాలు.. ఎక్కడైనా అలా పడుకుండి పోతాం.. నైట్‌ షిఫ్ట్‌లో నిద్రవస్తే.. ఎంతమంది బాత్రూమ్‌కి వెళ్లి నిద్రపోతారు.. డెస్క్‌ దగ్గర పడుకుంటే..సీసీ క్యామ్స్‌లో పడతాం..అదో పంచాయితీ. ఇలా నిద్ర మనల్ని ఏమైనా చేసేస్తుంది.. అలాగే నిద్రలేమి, అతి నిద్ర ఇవి రెండూ డేంజరే.. నిద్రకు డబ్బుకు దగ్గరి సంబంధాలు ఉన్నట్టు ఉన్నాయి.. డబ్బు కూడా మనకు కావాల్సినంత ఉంటేనే. లైఫ్‌ బాగుంటుంది.. తక్కువగా ఉన్నా, మరీ ఎక్కువగా ఉన్నా లొల్లే.. అయితే ఇప్పుడు మ్యాటర్‌ ఏంటంటే.. మీరు నైట్‌ ఎప్పుడో లేట్‌గా పడుకోని.. బాగా పొద్దుకెక్కాక నిద్రలేస్తారు..? మీరు ఆ బ్యాచ్చేనా.. ఇలా ఉదయం ఆలస్యంగా నిద్రలేచే వాళ్లకు కొన్ని బోనస్‌లు ఉన్నాయట.. అవేంటంటే..

ఆలస్యంగా లేస్తే.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జీవన విధానం సరిగా లేనందున వచ్చే ఊబకాయం, షుగర్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, హార్మోన్ల అసమతుల్యత వంటి అనేక రకాలైన జబ్బుల బారిన పడతారు. ఉదయంపూట ఆలస్యంగా నిద్రలేవడం కారణంగా.. మానసికపరమైన సమస్యలు 30 శాతం ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేస్తే.. మానసిక ఆందోళన ఒత్తిడి(Stress), డిప్రెషన్, చిరాకు, కోపం వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆలస్యంగా నిద్రలేస్తే.. జీవ గడియారం దెబ్బతిని హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయి. మెదడులో కణాలు కుచించుకుపోతాయి. ఈ కారణంగా మతిమరుపు, ఆల్జీమర్స్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

ఆలస్యంగా నిద్రలేచే అలవాటు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.. లేకపోతే.. అనేక రకాల సమస్యల బారిన పడతారు. రాత్రిపూట త్వరగా నిద్రించాలి. ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలంపాటు ఆరోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారు. రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర సరిపోతుంది. అలా కాకుండా రోజుకు 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతే మాత్రం ప్రమాదమే. అలా అని ఆ ఎనిమిది గంటలు..ఉదయం టైమ్‌లో ఉన్నా డేంజరే.. ఇలాంటి వాళ్లుకు గుండెపోటు ముప్పు 85 శాతం వరకూ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అతిగా నిద్రపోతే అంతర్గత అవయవాలైన కాలేయం, పేగుల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి కొవ్వు మీ జీవక్రియను దెబ్బతీసి అధిక కొలెస్ట్రాల్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులకు కారణమవుతుంది. ఎక్కువగా నిద్రపోతే బరువు పెరుగుతారు. పడుకున్నప్పుడు ఓ మనిషి ఖర్చు చేసే కేలరీలు చాలా తక్కువ. అందువల్ల రోజుకు 9 నుంచి 10 గంటల పాటు పడుకునే వారు మిగతావారితో పోలిస్తే 5 కేజీల బరువు పెరుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇలా ఎటు చూసుకున్నా..మీరు అతిగా నిద్రించడం వల్ల అన్నీ నష్టాలే.. కాబట్టి.. స్లీప్‌ ఎర్లీ, వేకప్‌ ఎర్లీ ఫార్మాలాను ఫాలో అయిపోండి.. నైట్‌ షిఫ్ట్‌లు మరీ ఎక్కువగా చేయకండి.. నెలలో ఒక వారం అయితే చాలు.. ఉదయం లేట్‌గా లేవొచ్చుగానే మీ స్వార్థంతో ఎగబడి నైట్‌ షిఫ్ట్‌లు చేస్తే..భవిష్యత్తులో పైన చెప్పిన రోగాలన్నీ వచ్చేస్తాయి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news