కొవ్వును కరిగించి..బరువు తగ్గించే అద్భుతమైన పొడి.. సైంటిఫిక్ గా తేల్చేశారుగా..!

-

కొవ్వును కరిగించాలి, బరువు తగ్గించాలి అని ఈరోజుల్లో అందరూ అనుకునే విషయమే.. అయితే దీనికోసం.. చాలా కష్టపడతారు, ఏవేవో తాగుతారు. ఫలితాలు వస్తున్నా.. మనకు ఓపిక ఉండక మధ్యలోనే ఆపేస్తాం. ఈరోజు బరువు తగ్గటానికి సులువైవ పొడి గురించి చూద్దాం. ఇది వాళ్లు వీళ్లు చెప్పింది కాదు.. సైంటిఫిక్ గా స్టడీ చేసి నిరూపించారుగా. ఇంకెందుకు ఆలస్యం ఆ పొడి ఏంటి, అధ్యయనంలో ఏం చెప్పారో చూసేద్దాం.
మీకు సొంటిపొడి తెలుసా.. అల్లంను ఎండపెడితే వస్తుంది. మాములుగా పచ్చి అల్లం కాస్త ఘాటుగా ఉంటుంది.. ఇక ఎండిన అల్లం సొంటి విపరీతమైన ఘాటు ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించడానికి, మెటబాలిజం స్పీడప్ చేయడానికి ఉపయోగపడుతుంది. సొంటి కొమ్ములను కొని..వాటిని ఎండపెట్టి పొడి చేసి..ఫిల్టర్ చేయండి. మెత్తడి పొడి మిగులుతుంది. ఈ మిశ్రమాన్ని.. రెండు మూడు గ్రాములు తీసుకుని.. పుల్కాతో లేదా.. అన్నం ముద్దతో తినేయండి.. ఇలా తినటం వల్ల.. సొంటిపొడిలో ఉండే జింజరాల్స్ (Gingerol) అనే కెమికల్స్ ఏం చేస్తాయంటే..
మాములుగా.. మనం తీసుకున్న ఆహార పదార్థాలు చెక్కరెగా మారుతాయి.. ఈ చెక్కర రక్తంలోకి వెళ్లి కొవ్వుగా మారుతాయి. ఇలా కొవ్వుగా నిల్వఉండి బరువు పెరుగుతారు. అయితే.. సొంటిలో ఉండే జింజరాల్స్..చెక్కర కొవ్వుగా మారకుండా, ఎనర్జీగా అవడానికి చేస్తుందని 2014వ సంవత్సరంలో ఇండియన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ స్పైసెస్ అండ్ రీసర్చ్- కేరళ( Indian Institute Of Spices Research- Kerala)వారు పరిశోధన చేసి కనుగొన్నారు. చెక్కర పదార్థాలు కరిగితే.. మెటబాలిజం స్పీడ్ అవుతుంది.
రోజుకు రెండు నుంచి మూడు గ్రాములు సొంటిపొడిను నాలుగు నుంచి ఆరు వారాలు తీసుకుంటే.. బ్లడ్ లో ఉండే ట్రై గ్లిజరెయిడ్స్, బ్లడ్ లో ఉండే కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుందని కూడా అధ్యయనంలో గుర్తించారు. ఈరోజుల్లో ఈ అ‌వసరం చాలా మందికి ఉంది. ఎంతోమంది చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. ఏ ఆహారం చూసినా.. ఫ్యాట్ కంటెంట్ ఉండేది. అసలు తినేది బయట ఆహారం అయితే.. వారి పరిస్థితి మరీ దారుణం. అనతికాలంలోనే.. అంచనాలకు మించి లావు అవుతారు. అలాంటి వారు సొంటిపొడిని ఇలా వాడుకుంటే చాలు.
పూర్వం రోజుల్లో సొంటిపొడిని ఆకలిపుట్టించడానికి కూడా వాడేవారు. కొంతమంది.. ఆకలిమందం..అసలు తినేవాళ్లు కాదు.. నెయ్యితో సొంటిపొడి ముద్దలు చేసి తినడానికి ముందు ఈ ముద్దలు ఇచ్చేవాళ్లు. నాలుగు రోజులకే..సమస్య పోతుంది. ఇదే విషయాన్ని సైంటిస్టులు కూడా స్పష్టం చేశారు. డైజెషన్ కు బాగా ఉపయోగపడుతుంది.
ఇంకా ప్రగ్నెంట్ లేడీస్.. వికారం, వాంతులతో ఇబ్బందులుపడుతుంటారు. ఇది తగ్గించడానికి సొంటిపొడి ఉపయోగపడుతుందని కూడా అధ్యయనంలో కనుగొన్నారు. ఎలా వాడొచ్చంటే.. సొంటిపొడిని మెత్తగా చేసుకుని 3-4 గ్రాములు తీసుకుని..అందులో కొంచెం తేనె వేసుకుని.. నాలుగు చుక్కలు నిమ్మరసం వేసుకుని.. బాగా కలుపుకుని.. మార్నింగ్ అది నాకితే.. వికారం, వాంతులు ఫీలింగ్ ఉండదు. వాంతులు తగ్గుతాయి.
సొంటిపొడిని కొద్ది మోతాదులో వాడినప్పుడు కూడా.. మెడిసినల్ ప్రోపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుంది. పూర్వం రోజుల్లో అందరి ఇళ్లలో సొంటివాడకం ఉండేది..కానీ ఇప్పుడే అల్లాన్ని ఎక్కువగా వాడుతూ.. సొంటిని సైడ్ చేశారు. బుుషులు చెప్పింది సైంటిఫిక్ గా నిరూపించారు కాబట్టి.. పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు వాడుకోవచ్చంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news