గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి మంచిది కాదా? ఆహారాలపై ఉన్న అపోహాలు..

-

డైట్ మెయింటైన్ చేయాలనుకునేవారు ఎక్కువగా తినకుండా ఆకలితో ఉండడమో, లేదా ఉడకబెట్టిన ఆహారాలు మాత్రమే తీసుకోవాలనో ఆలోచిస్తుంటారు. ఈ ప్రాసెస్ లో కొన్ని ముఖ్యమైన ఆహారాలను మిస్ అవుతుంటారు. ఆహారం మీద ఉన్న అపోహాలే దీనికి కారణం. ప్రస్తుతం ఆహారాలపై ఉన్న అపోహాలను తెలుసుకుని, వాటి వెనక ఉన్న సత్యాలను వివరించుకుందాం.

అపోహా: పాల పదార్థాలు వాతం కలిగిస్తాయి.

నిజం: పాలలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లు ఇంకా రకరకాల కొవ్వులు ఉంటాయి. ఈ పోషకాలు ఒక్కో పాల పదార్థంలో ఒక్కోలా ఉంటాయి. ఐతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు పాలు తాగవద్దని చెబుతారు. అది వేరే సంగతి.

అపోహ : గుడ్డు పచ్చసొన ఆరోగ్యానికి హానికరం

నిజం: గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ, కె, బి 12, ఫోలేట్, ఐరన్, రిబోఫ్లేవిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా మేళు కలిగిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో గుడ్డును ఖచ్చితంగా చేర్చుకునేది అందుకే.

అపోహా: ఆరెంజ్ జ్యూస్ లో చక్కెర ఎక్కువ ఉంటుంది.

నిజం: ఇంట్లో తయారు చేసుకునే ఆరెంజ్ జ్యూస్ లో చక్కెర శాతం తక్కువే. కాకపోతే స్టోర్లలో దొరికే ఆరెంజ్ జ్యూస్ బాటిల్స్ లో చక్కెర ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రుచి కోసం అనేక ఇతర పదార్థాలను కలపడం వల్ల ఎక్కువ చక్కెర ఉంటుంది.

అపోహా: కొవ్వు మీలో కొవ్వును పెంచుతుంది.

నిజం: కొవ్వు తినడం వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుందని అనుకోవద్దు. కొవ్వులో ఒకరకమైన చెడుకొవ్వు మాత్రమే దీనికి కారణం అవుతుంది. మంచి కొవ్వు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే మంచికొవ్వు ఆహారంలో ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version