వంకాయ ఇష్టమని ఎక్కువగా తినేస్తున్నారా…? మరి ఈ సమస్యలు వస్తాయట..!

ఆహా ఏమి రుచి అనరా మయమరిచి.. రోజు తిన్నామరి మోజే తీరనిది.. అంటూ రోజు వంకాయ  తినేస్తున్నారా..? నిజానికి చాలా మందికి వంకాయ అంటే ఎంతో ఇష్టం. గుత్తి వంకాయ కూర మొదలు ఎన్నో రెసిపీస్ ని మనం వంకాయతో తయారు చేసుకోవచ్చు.

వంకాయతో కూరలు బాగా ఉంటాయని చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా  వంకాయను ఎక్కువ తీసుకుంటూ ఉంటారా..? అయితే ఈ సమస్యలు మీకు తప్పవు. వంకాయ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వంకాయ వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు చూద్దాం.

జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండే వాళ్ళు వంకాయ కి దూరంగా ఉంటే మంచిది ఎందుకంటే వంకాయ ఎక్కువ తీసుకోవడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలు వస్తాయి.

అదే విధంగా యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్ తీసుకునే వాళ్ళు వంకాయ కి దూరంగా ఉండాలి ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి మందుల్ని వాడుతూ వుంటారు చాలామంది అలాంటి వాళ్లు వంకాయ కి దూరంగా ఉండాలి.

వంకాయ లో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ ఒంట్లో ఐరన్ ఎక్కువగా ఉన్నట్లయితే వంకాయను అస్సలు తీసుకోకూడదు.

ఎనీమియా సమస్యతో బాధపడే వాళ్ళు వంకాయ కి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కంటికి ఇరిటేషన్ కలుగుతున్నప్పుడు కూడా వంకాయ కి దూరంగా ఉండాలి. ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు వంకాయకు దూరంగా ఉంటే మంచిది లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.