పాలక్, పన్నీర్ కలిపి తింటున్నారా..? ఈ సమస్య వస్తుందట..!

-

చాలా మంది పాలక్ మరియు పన్నీర్ ని కలిపి వండుకుంటూ ఉంటారు. మీకు కూడా పాలక్ పన్నీర్ అంటే ఇష్టమా..? ఎక్కువగా పాలక్ పన్నీర్ ని తింటూ ఉంటారా..? కానీ ఇది చూశారంటే ఇక మీదట మీరు అలా తీసుకోరు. ఇలా కలిపి రెండిటిని తీసుకుంటే సమస్య వస్తుందట. ఆరోగ్య నిపుణులు ఈ విషయాన్ని చెప్పారు. మరి ఈ రెండిటిని కలిపి తింటే ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పన్నీర్ మరియు పాలక్ రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివే. డైట్ లో వీటిని తీసుకుంటే మనకి చక్కటి లాభాలు ఉంటాయి. పాలక్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి పైగా తేలికగా మనం వండుకోవచ్చు కూడా. పన్నీర్ లో అయితే ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే కాంబినేషన్స్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యంగా క్యాల్షియం మరియు ఐరన్ రెండిటిని కలిపి తీసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయి. క్యాల్షియం సమృద్ధిగా పన్నీర్ లో ఉంటుంది అలానే పాలక్ లో చూస్తే ఐరన్ ఉంటుంది. అయితే ఈ రెండిటిని తీసుకోవడం వలన పన్నీర్ లో వుండే క్యాల్షియం పాలక్ లో ఉండే ఐరన్ శోషణని నిరోధిస్తుంది.

ఇలా శరీరంలో ఐరన్ ని క్యాల్షియం అడ్డుకుంటుంది కాబట్టి ఈ తప్పును ఎప్పుడు చేయొద్దు కావాలంటే మీరు పాలక్ తో బంగాళాదుంప లేదంటే ఇతర కూరగాయలని వండుకోండి. ఈ రెండిటినీ కలిపి వండుకోవడం వలన ఇలాంటి సమస్య కలుగుతుంది కాబట్టి ఆ తప్పుని చేయొద్దు.

Read more RELATED
Recommended to you

Latest news