పరగడుపునే తులసి ఆకులు తింటున్నారా..అయితే జాగ్రత్త..!!

-

హిందూ ఆచారాలలో తులసి మొక్కకు దేవతలతో కూడిన స్థానం ఉంది. తులసి మొక్క ఇంటి ముందు ఉండటాన్ని ఎంతో శుభంగా సూచిస్తారు.రోజు ఉదయం,సంధ్య సమయంలో దీపం సమర్పించి, పూజలు చేయడం హిందూ ఆచారాలలో ఒక భాగం . తులసి మొక్కను లక్ష్మీ దేవి ప్రతి రూపంగా పూజిస్తారు.కానీ తులసి మొక్కకు పూజకే కాకుండా.. ఆయుర్వేద వైద్యంలో కూడా తులసి ఆకులకు అత్యున్నత స్థానం వుంది.ఈ మొక్క చాలా ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.కొన్ని వందల సంవత్సరాలనుండి వ్యాధులను నివారించడానికి ఆయుర్వేదంలో ఈ ఆకులు ఉపయోగపడుతున్నాయి . రోజూ ఉదయాన్నే తులసిఆకులను తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తీసుకుంటే మాత్రం కొంతమంది అనారోగ్యానికి కారణం అవుతుంది. ఆ అనారోగ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

తులసిని కషాయం మరియు టీ తయారీలోనూ ఉపయోగిస్తారు.వీటి ఆకులు తింటే నోటి దుర్వాసన మరియు దంత సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా వైరల్ డిసిజెస్ పోరాడటానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ని పెంచడంలో సహాయపడుతుంది.అయితే తులసి ఆకులను పరగడుపునే తింటే అనేక ఆరోగ్యసమస్యలు వస్తాయి. ఇందులో ఉండే ఎస్ట్రాగోల్ అనే రసాయనం కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అందుకే నేరుగా తులసి ఉత్పత్తులను కొంతమంది తీసుకోకూడదు.

తులసిఆకులు, నూనెను పరగడుపున తీసుకోకూడదు. ఇది శరీరంలోని రక్త ప్రసరణ ను పెంచి రక్తం తొందరగా గడ్డ కట్టకుండా నిరోదిస్తుంది. అందుకే రక్తస్రావం అధికంగా ఉన్నవారు.. తులసి ఉత్పత్తులను దురంగా ఉంచాలి.కడుపుతో ఉన్నవారు కూడా తులసిని ఎక్కువగా తీసుకూడదు.ఇది శరీర వేడిని పెంచుతుంది.గర్భధారణ సమయంలో సాధారణంగా రక్తహినాతతో బాధపడుతుంటారు. అలాంటి వారు దీనిని ఎక్కువగా రక్తహినతతో బాధపడుతుంటారు.ఇందులో యూజినాల్ అనే మూలకం రక్తాన్ని పలుచగా చేస్తుంది.హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు తులసి ఆకులను తీసుకోకూడదు.డయాభేటీస్ తో బాధపడేవారు తులసిని వాడకపోవడం మంచిది. తులసి ఆకులను తీసుకుంటే చక్కర స్థాయిలు అదుపు తప్పుతాయి. అతిగా తులసి తీంటే చక్కర స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news