ఒత్తిడి ఎక్కువైతే.. మానసిక ప్రశాంతత దూరం అయిపోతుంది. దీనివల్ల ఎన్నో రకాల సమస్యల భారిన పడాల్సి వస్తుంది. అధిక ఒత్తిడి కాస్తా.. కొన్నాళ్లకు డిప్రెషన్‌కు దారితీస్తుంది. డిప్రెషన్‌లో ఉన్న వారు వెంటనే చికిత్స తీసుకోవాలి. లేదంటే తీవ్ర దుష్పరిణామాలను కలగజేస్తుంది. కింద తెలిపిన పలు ఆయుర్వేద మూలికలు డిప్రెషన్ నుంచి బయట పడేలా చేస్తాయి. వాటిని తరచూ వాడితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ మూలికలు ఏవో ఇప్పుడు తెలుసుకుందామా..!
డిప్రెషన్‌ను తగ్గించడంలో పుదీనా ఆకులు బాగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే ఔషధ గుణాలు మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. డిప్రెషన్ నుంచి బయట పడేస్తాయి. ఉదయం, సాయంత్రం పుదీనా ఆకులను నీటిలో వేసి మరిగించి ఒక కప్పు మోతాదులో టీ లా చేసుకుని తాగుతుండాలి. దీంతో డిప్రెషన్ తగ్గుతుంది.
అశ్వగంధకు ఆయుర్వేదంలో అధిక ప్రాధాన్యత ఇస్తారు.. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తాయి. మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. డిప్రెషన్ నుంచి బయట పడేస్తాయి. ఉదయం, సాయంత్రం అశ్వగంధ ట్యాబ్లెట్ ఒకటి 250 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకోవాలి. లేదా రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి తాగాలి. దీని వల్ల డిప్రెషన్ తగ్గుతుంది.
శంఖపుష్పి మొక్క మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది. దీని పువ్వులు నీలి లేదా తెలుపు రంగులో ఉంటాయి. ఈ పువ్వులను సేకరించి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి.. ఇలా రోజుకు ఒకసారి తాగాలి. దీంతో డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.
డిప్రెషన్‌ను తగ్గించడంలో సర్ఫగంధ కూడా బాగానే పనిచేస్తుంది. మనస్సును ప్రశాంతంగా మార్చి చక్కగా నిద్ర పట్టేలా చేస్తుంది. దీంతోపాటు బీపీ, నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి. సర్పగంధ చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం అర గ్రాము మోతాదులో పాలలో కలిపి తీసుకోవాలి. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు.
వీటన్నింటి కంటే.. ముఖ్యం.. అసలు మీరు దేనివల్ల డిప్రషన్‌కు లోనయ్యారో.. దానినుంచి త్వరగా బయటపడేలా ప్రయత్నించండి.. మోసం, లోటు ఏదైనా సరే.. కొన్ని రోజులే.. అన్ని గాయాలు నొప్పినే కాదు.. మీ గమ్యాన్ని కూడా చూపిస్తాయి. కాబట్టి.. మీకు మీరే మోటివేట్ చేసుకుని.. అందులోంచి త్వరగా బయటపడండి.. మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. !