ఈ ఆయుర్వేద చిట్కాలతో జలుబు, దగ్గు మాయం..!

-

చలికాలం పైగా ఒమీక్రాన్ వేగంగా స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో దగ్గు, జలుబు ఎక్కువ మందికి వస్తోంది. దగ్గు, జలుబు రాకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. అలానే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. కొన్ని ఆయుర్వేద టిప్స్ ఇక్కడ వున్నాయి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా దగ్గు, జలుబు రాకుండా ఉండచ్చు. మరి ఆయుర్వేద నిపుణులు చెప్పిన అద్భుతమైన చిట్కాలు గురించి చూసేద్దాం.

ఈ ఆయుర్వేద చిట్కాలతో జలుబు, దగ్గు మాయం

ములేతి మరియు దాల్చిని :

ములేతి, దాల్చిని తో కూడా దగ్గు, జలుబు తగ్గుతాయి. ములేతి ని నీళ్లలో వేసి మరిగించి నీళ్ళు సగం అయ్యే వరకు ఉంచండి. ఆ తర్వాత ఈ నీళ్లను వడకట్టి అందులో దాల్చిన పొడి వేయండి. దీనిని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు సమస్య రాదు.

తిప్పతీగ మరియు ఉసిరి :

తిప్పతీగ, ఉసిరి కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. అలానే దగ్గు జలుబు రాకుండా చూసుకుంటాయి. ఈ రెండూ కలిపి ఉన్న జ్యూస్ మనకు మార్కెట్లో దొరుకుతుంది దీనిని తీసుకొని కూడా మీరు దగ్గు, జలుబు బారిన పడకుండా ఉండొచ్చు.

అల్లం మరియు తులసి డికాషన్ :

తులసి ఆకుల్ని తీసుకుని దంచి పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నీళ్ళు వేసి దంచిన తులసి వేసి మరిగించండి. నీళ్లు సగం అయ్యాక అల్లం పొడి వేయండి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కూడా ఇబ్బందులు తగ్గుతాయి. దగ్గు, జలుబు బారిన పడకుండా ఉండొచ్చు.

వెల్లుల్లి నూనె :

నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలను నువ్వుల నూనెలో వేసి ఈ నూనె ని మసాజ్ చేసుకుంటే దగ్గు జలుబు సమస్య ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news