వర్క్ ఫ్రమ్ హోమ్: వెన్నెముక సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

కరోనా వల్ల పనులన్నీ ఇంటి నుండే జరుగుతున్నాయి. ఆ కారణంగా ఒకే స్థితిలో ఎక్కువ సేపు కూర్చోవడం అలవాటైంది. కానీ ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. ఒకే స్థితిలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల వెన్నెముక సమస్యలు నడుము నొప్పి వస్తాయి. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళందరూ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

దీనికోసం కొన్ని నివారణలని ఇక్కడ తెలుసుకుందాం.

మీ పోస్టర్:

మీరు కూర్చునే విధానం సరిగ్గా ఉండాలి. మీ చెవులు మీ భుజాల మీదే ఉండాలి. అలా కాకుండా ముందుకు వస్తున్నాయనుకుంటే జాగ్రత్త పడాల్సిందే. చేతులు పెట్టుకోవడానికి సరైన ఉపరితలం ఉండాలి. కాళ్ళు నేలమీద సరిగ్గా ఉండాలి. మీ పోస్టర్ సరిగ్గా ఉండడానికి కుర్చీకి నడుముకి మధ్యలో ఏదైనా టవల్ పెట్టుకుంటే బాగుంటుంది.

సమయం:

ఎక్కువ సమయం ఒకే పొజిషన్ లో కూర్చోవద్దు. 40-45నిమిషాల తర్వాత కుర్చీలోంచి లేచి ఒక ఐదు నిమిషాల పాటు నడవండి. దానివల్ల రక్త ప్రసరణ సరిగ్గా అవుతుంది. కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. అలా అని బయటకి వెళ్ళమని కాదు. ఇంకా గట్టిగా లోపలికి గాలి పీల్చుతూ గట్టిగా బయటకి వదలండి. దీనివల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటుంది.

నడుము నొప్పి వస్తుంటే:

ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల నడుము నొప్పి సమస్యలు వస్తుంటే వ్యాయామం చేయండి. నడుముని వెనక్కి వంచడం, భుజాల వ్యాయామాలు చేయడం మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వెన్నెముక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే సరిపోతుంది.