చాలా మంది డార్క్ సర్కిల్స్ తో బాధ పడుతూ ఉంటారు. డార్క్ సర్కిల్స్ ని పోగొట్టుకోవడానికి అనేక రకాలు చిట్కాలని ట్రై చేస్తూ ఉంటారు మీకు కూడా డాగ్ సర్కిల్స్ ఉన్నాయా దాని నుండి బయట పడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా పోవడం లేదా అయితే కచ్చితంగా ఈ టిప్స్ ని మీరు పాటించాల్సిందే. వీటిని పాటిస్తే ఏ బాధ ఇబ్బంది కూడా ఉండదు. త్వరగా ఇవి దూరమవుతాయి. సరైన నిద్ర లేకపోవడం రక్తహీనత అనారోగ్యం కారణంగా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.
కీరదోస:
కీరదోస చర్మానికి చాలా మేలు చేస్తుంది కీరదోస ముక్కల్ని కళ్ళ కింద పెట్టి రుద్దడం వలన
డార్క్ సర్కిల్స్ దూరమవుతాయి.
కొబ్బరి నూనె:
మచ్చల మీద కొబ్బరి నూనె తో మసాజ్ చేయండి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో ఇలా మసాజ్ చేయడం వలన డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి.
మాయిశ్చరైసర్:
ప్రతి రోజు కళ్ల కింద మాయిశ్చరైజర్ ని అప్లై చేయండి ఇది కూడా డార్క్ సర్కిల్స్ ని పోగొట్టేందుకు సహాయపడుతుంది.
కంటికి మసాజ్:
రెగ్యులర్ గా కళ్ళకి మసాజ్ చేస్తూ ఉండండి దీనితో రక్త సరఫరా మెరుగుపడుతుంది. డార్క్ సర్కిల్స్ వంటి ఇబ్బంది ఉండదు.
మంచి నిద్ర:
ప్రతి రోజు మంచి నిద్రని పొందితే కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడవు.
బంగాళాదుంప మాస్క్:
బంగాళదుంప లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కంటి కింద బంగాళదుంప ముక్కల్ని ఉంచితే కూడా కూడా డార్క్ సర్కిల్స్ తొలగిపోతాయి. అలానే ఆరెంజ్, టమాటో లెమన్ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడతాయి.