జీర్ణ సమస్యల నుండి డయాబెటీస్ తగ్గించడం వరకు “ఆకాకరకాయ”తో ఎన్నో లాభాలు..!

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాగే ఆరోగ్యం సరిగా ఉండాలని ఎన్నో రకాల పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని చాలా మంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నది మనం చూస్తున్నదే. అయితే చాలా సమస్యలను తగ్గించడానికి ఆకాకరకాయ ( Spiny Gourd ) బాగా ఉపయోగపడుతుంది.

ఆకాకరకాయ | Spiny Gourd

ఆయుర్వేద వైద్యంలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. బాగా బరువు పెరిగి పోతున్న వాళ్ళు దీనిని తీసుకుంటే మంచిదే. దీనిలో ఐరన్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆకాకరకాయ వల్ల కలిగే లాభాలు

బరువును కంట్రోల్ చేసుకోవచ్చు :

త్వరగా బరువు పెరిగి పోతున్నాను అని బాధపడేవాళ్ళు బరువును కంట్రోల్లో ఉంచడానికి ఆకాకరకాయలని డైట్ లో తీసుకోవచ్చు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు.

జీర్ణ సమస్యలు తగ్గుతాయి :

ఆకాకరకాయ తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జీర్ణ సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్ గా దీన్ని తీసుకోండి.

జబ్బులు తగ్గుతాయి :

ఆయుర్వేద గుణాలు ఉండే ఆకాకరకాయని వర్షాకాలంలో తీసుకుంటే వర్షాకాలంలో వచ్చే జబ్బులు నుంచి బయట పడవచ్చు.

డయాబెటిస్ తో బాధపడే వాళ్లకీ మంచిది :

షుగర్ లెవెల్స్ అధికంగా ఉంటే దీనిని తీసుకోండి. దీనితో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. ఇలా ఎన్నో లాభాలు దీని ద్వారా మనం పొందొచ్చు.

కరోనా సమయంలో ఆకాకరకాయ వలన ఎంత మేలు కలుగుతుందంటే..?

రక్త పోటు త‌గ్గిస్తుంది

బోడ‌కాక‌రకాయ ర‌సం క్ర‌మం త‌ప్ప‌కుండా రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటుని నివారించ‌వ‌చ్చు. ఇందులో ఉండే యాంటీ-లిపిడ్ పెరాక్సిడేటివ్ లక్షణాలు ధమని గోడలను శుభ్ర‌ప‌రుస్తాయి.

కిడ్నీ రాళ్ళు

ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది మరియు మూత్రపిండాలు మరియు మూత్రాశయంలోని రాళ్లను సమర్థవంతంగా తొలగించగలదు.

యాంటీ ఏజింగ్

ఆకాక‌ర‌కాయ‌లో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్క‌లంగా ఉండ‌టం వ‌ల్ల చ‌ర్మాన్ని నిగ‌నిగ‌లాడేలా చేయ‌గ‌ల‌దు. ఇంకా ఇందులో బీటా కెరోటిన్, లుటిన్, క్శాంథైన్స్ మొదలైనవి ఉన్నాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు చక్కగా ఉండేలా చేయడంలో సహాయపడతాయి.