వంటింటి పోపుడబ్బాల్లో కచ్చితంగా ఉండే వాటిల్లో ఇంగువ ఒకటి. తాలింపులో ఇదే వేస్తే సువాసన..ఆహా..వీధి చివర వరకూ వెళ్లాల్సిందే. కరివేపాకు, ఇంగువ లేకుండా అసలు కొందరు మహిళలకు తాలింపు వేయడానికి ఇష్టపడరు. అంత టేస్ట్, స్మెల్ ను ఇస్తాయి ఇవి. మ్యాటర్ ఏంటంటే.. మనం వంటల్లో వాడుకునే చాలా పదార్థాలను రుచి కోసం, వాసన కోసం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. అసలు వాటిని వంటల్లో వాడుకునే కాన్సప్ట్ పెట్టడానికి కారణాలు వేరే ఉన్నాయి. మనం వాసనకు కనక్ట్ అయిపోయాం. అందుకే.. దీనివల్ల కేవలం సువాసన మాత్రమే కదా.. వాడకపోతే ఏమైతుందిలే అని కొన్ని సార్లు లైట్ తీసుకుంటారు. ఈరోజు మనం అసలు ఇంగువ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం.
గ్యాస్ సమస్యను తగ్గించడంలోనూ ఇంగువ ఎక్కువగా సహాయపడుతుంది. ఇది సహజంగా జీవక్రియను మెరుగుపరుస్తుంది. పంటి ఇన్ఫెక్షన్, నొప్పి, చిగుళ్ల నుండి రక్తస్రావం సమస్యను తొలగించడంలో ఇంగువ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక చర్మ వ్యాధులను నయం చేయడంలో నెంబర్ వన్ గా పనిచేస్తుంది. రింగ్వార్మ్, గజ్జి, దురద, చర్మ వ్యాధులను నయం చేయడంలో ఇంగువ ఉపయోగపడుతుంది.
కఫం, జలుబు-దగ్గు సమస్యను తొలగించడంలో కూడా ఇంగువది గొప్ప పాత్ర.
పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పిని, తలనొప్పిని తగ్గించడంలో ఇంగువ అద్భుతంగా ఉపయోగపడుతుంది.
కీటకాలు లాంటివి కుట్టినప్పుడు వచ్చే వాపు, దుద్దర్లను ఇంగువతో నయం చేసుకోవచ్చు.
ఇంగువ రక్తపోటును నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే అనేక ఇతర ఔషద లక్షణాలను కలిగి ఉంది.
కడుపు నొప్పి, తిమ్మిరి సమయంలో… ఉబ్బరం తగ్గించడంలో కూడా ఇంగువ చాలా సహాయపడుతుంది. వేడి నీటిలో కలిపిన ఇంగువ పొడిని వేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు నీటిని, ఇంగువని కలిపి తాగితే ఉపశమనం ఉంటుంది. మూత్రాశయం, మూత్రపిండాల్లో పేరుకున్న మలినాలు, వ్యర్థాలు బయటకు పోయేలా చేస్తుంది.
ఇంగువని వేడి నీటీతో కలిపి రోజూ తాగితే.. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలకు తగ్గించుకోవచ్చు.
ఇంగువతో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు వాడుకోవడంలో ఎలాంటి సమస్యా లేదు. అయితే వ్యాధులకు ఇంగువ పొడని వాడటంలో మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఒకసారి వైద్యుల సలహా తీసుకుని మాత్రమే ఉపయోగించగలరు.