బరువు తగ్గాలనుకునే వారికి కాకరగింజలు బెస్ట్‌ ఆప్షన్‌..ఇంకా చాలా..!

-

నిజం చేదుగా ఉంటుంది..అబద్ధం తియ్యగా ఉంటుంది అంటారు.. కానీ ఎప్పటికైనా నిజమే మనల్ని కాపాడుతుంది. సొసైటీ విషయంలోనే కాదు..మన శరీరంలో కూడా ఇది వందశాతం నిజం. తియ్యగా ఉండేవి మన ఆరోగ్యానికి మంచిది కాదు..చేదుగా ఉండేవి మనకు నచ్చవు. కానీ మనల్ని ఆరోగ్యంగా అవే ఉంచుతాయి. జ్వరం వస్తే చేదుగా ఉండే టాబ్లెట్‌ వేయాల్సిందే..! ఇక తినే వాటిల్లో చేదు అంటే టక్కున గుర్తొచ్చేది..కాకరకాయ. చాలామంది ఇది చేదుగా ఉంటుందని ఇష్టపడరు. కానీ ఈ కాయలో ఉన్న పోషకాలు అమోఘం. ఎన్నో వ్యాధులకు కాకరకాయ దివ్యఔషధంగా పనిచేస్తుంది. ముదిరిపోయిన కాయల్లో గింజలు మీరు చూసే ఉంటారు. ఆ గింజలతో కొవ్వు కరిగించుకోవచ్చని మీకు తెలుసా..?

కాకరకాయ గింజలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధిక పరిమాణంలో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు కాకరకాయ గింజలని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాకర గింజలను ఎండబెట్టి పొడిగా మార్చి వేడినీళ్లలో వేసుకుని తాగితే కడుపు శుభ్రపడుతుంది.

కాకరగింజలు రక్తంలో చక్కెర, గుండెపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలని తగ్గిస్తాయి. మదుమేహులలో మలబద్ధకం సమస్య తొలగిపోతుందట. చక్కెర స్థాయి అదుపులో ఉంచుతాయి. కాకర గింజలు మధుమేహ రోగులకు ఒక వరంగా చెప్పవచ్చు. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఈ గింజలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట.

ఆస్తమా, జలుబు, దగ్గు వంటి మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్భుతవమైన ఔషధంగా ఇది పనిచేస్తుంది. లివర్‌ సమస్యలు తగ్గించటంలో ఈ గింజలు ఉపకరిస్తాయి. జీర్ణక్రియకు ఉపకరిస్తుంది. ఇంకా ఈ గింజల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. చర్మాన్ని ముడతలు లేకుండా ఉంచడంలో, అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో విటమిన్ సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి.. కాకరతీగ ఇంట్లో ఉన్నవాళ్లు అస్సలు వృథా చేయకుండా వాడేయండే..!

పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news