బీపీ బాధితులు డైలీ టీ తాగుతున్నారా..? ఎంతవరకు కరెక్టో తెలుసా

-

ఈ రోజుల్లో దీర్ఘకాలికరోగాలతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. ప్రతి ఇంట్లో డయబెటీస్, అధికరక్తపోటుతో పేషెంట్స్ ఉంటున్నారు. వారికోసం కుటుంబసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పటికీ.. కొన్ని లైఫ్ స్టైల్ హాబిట్స్ మాత్రం వారు మార్చుకోలేరు. అవి ఏం కాదులే అని కంటిన్యూ చేస్తారు. ఈ క్రమంలో.. రోగం ముదిరిపోతుంది. డయబెటీస్ పేషెంట్స్ అన్నం తినకూడదు. వైట్ రైస్ అసలే తినకూడదు. పొట్టుతియ్యని బియ్యం రోజుకు ఒక పూట తినాలి. కానీ ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారు. అలాగే బీపీ పేషెంట్స్ కూడా.. ఉప్పులేకుండా ఉండాలి వీరి డైట్ కానీ.. ఉంటున్నారా..? డైలీ రెండు సార్లైనా టీ తాగుతారు. అసలు బీపీ పేషెంట్స్ టీ తాగొచ్చా..?
టీ తాగడం కరెక్టేనా..?
టీ తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగదు కానీ.. ఇతర సమస్యలతో బాధపడేవారు హైబీపీలో టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటు ఉన్నవారికి ఎసిడిటీ సమస్య ఉంటే టీ అస్సలు తాగకూడదు. ఆందోళన, ఒత్తిడి ఉంటే టీ తాగకూడదు. టీ తాగితే బీపీ పెరిగే అవకాశం ఉంది. హై బీపీ ఉన్నవారు.. మూత్ర విసర్జనలో మంటగా ఉన్నట్లయితే అలాంటి వారు టీకి దూరంగా ఉండాలి. టీ ఎక్కువగా తాగడం వల్ల ఛాతీ, పొట్టలో మంట వస్తుంది. ఏ వ్యక్తి కూడా ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. రక్తపోటు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల దాని స్థాయి పెరుగుతుంది. ఈ స్థితిలో ఛాతీలో మంట కూడా వస్తుంది.
బీపీని ఇలా కంట్రోల్ చేయొచ్చు..
అధిక రక్తపోటు ఉన్న రోగులు కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోరాదు. అంటే టీలు, కాఫీలకు వీలైనంత దూరంగా ఉండాలి.
రక్తపోటు రోగులు వారి ఆహారంలో ఉప్పు- సోడియం తక్కువగా ఉండాలి. ఉప్పు – సోడియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటు అదుపు లేకుండా పోతుంది. ఉప్పును తక్కువ మోతాదులో తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. అసలు వీలైతే ఉప్పులేకుండా మీగడతో వంట చేసుకుని తినొచ్చు.
చిప్స్, ఊరగాయలు మొదలైన ప్యాక్డ్ ఫుడ్స్‌లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వాటిని అస్సలు తినొద్దు.
ధూమపానం, మద్యం సేవించడం వీరికి మంచిది కాదు.
ప్రాణాయామం, యోగా, వ్యాయామం వంటివి తప్పనిసరిగా చేయడం అలవాటుగా చేసుకోవాలి.
సాధారణంగా రక్తపోటు 120/80MMHg ఉండాలి. రక్తపోటు పెరిగితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, బలహీనత, తలనొప్పి, ఛాతీ నొప్పి లాంటివి కనిపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news