రోగాలను దూరం చేసే క్యాబేజీ.. ఎలా అంటే..?

-

సాధారణంగా క్యాబేజీ అంటే భయపడే వారి సంఖ్య చాలా ఎక్కువ.. ఎందుకంటే క్యాబేజీని తినడానికి చాలామంది ఆసక్తి చూపరు. పైగా ఇది ఉడికేటప్పుడు ఒక రకమైన కు దుర్వాసన వస్తుంది . కాబట్టి దీన్ని తినడానికి ఆసక్తి చూపించరు. కానీ క్యాబేజీని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మరణ సంకేతాలు కూడా మనల్ని దరిచేరవు అని వైద్యుల సైతం చెబుతున్నారు మరి క్యాబేజీ వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

క్యాబేజీ కడుపులో ఉండే అల్సర్లను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో ఉండే ఫైబర్ ప్రేగులను శుభ్రం చేస్తుంది..ప్రేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.అంతేకాకుండా జీర్ణాశయం లో ఏర్పడే క్యాన్సర్లను నివారిస్తుంది.ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులు,దురదలు, అలర్జీలను, కీళ్ల నొప్పులను, జ్వరాలను తగ్గేందుకు సహాయం చేస్తుంది.ఇందులో ఉండే బీటా కెరోటిన్ క్యాన్సర్ కారకాలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దంత సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.

ఆయుష్షును పెంచే దివ్య ఔషధం. గ్రీన్ క్యాబేజీలో క్రోమియం సమృద్ధిగా ఉండడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. కొవ్వు నిలువలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కంటి లోపల మచ్చలను తగ్గించి కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా క్యాబేజీలో ఎమినో ఆసిడ్స్ సమృద్ధిగా ఉండటం వల్ల కడుపులో మంట , అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి.. శరీరం త్వరగా జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి . నీటి శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి డీ హైడ్రేషన్ నుంచి శరీరాన్ని కాపాడుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news