డయాబెటిస్ రోగులు సీతాఫలం తినవచ్చా? అసలు విషయం ఏమిటంటే..?

-

సీతాఫలం ఇది వర్షాకాలంలో దొరికే అతి మధురమైన పండు.ఇది నేచరల్ గా తీపి, ఇతర విటమిన్స్ ను కూడా కలిగి ఉంటుంది. ఇవన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ సీతాఫలం ఎక్కువగా తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది.కానీ సీతాఫలం తినడం పై చాలా మందికి అపోహలు వున్నాయి అదేంటో చూద్దాం.

మీరు షుగర్ తో బాధపడుతున్నారా..
మధుమేహం ఉందని తెలిస్తే చాలు..చాలా వరకు షుగర్ ఫ్రూట్స్ కు, ఇతర ఆహారాలకు దూరంగా ఉంటారు.
ఈ కారణంగా,షుగర్ తో బాధపడేవారు సీతాఫలాన్ని తినడానికి ఇష్టపడరు. అయితే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఎప్పుడైనా ఒకసారి సీతాపలమును ఎటువంటి అనుమానం లేకుండా తీసుకోవచ్చు.

ఉభాకాయాంతో బాధపడేవారు..
సాధారణంగా సీతాఫలం తినడం వల్ల శరీర బరువు మరింత పెరుగుతుందని అపోహలు వున్నాయి. ఇందులో ఉండే విటమిన్ బి6 అలాగే కడుపులో గ్యాస్ తగ్గించే ఇతర అంశాలు ఉంటాయి. అందువలన ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన పండు అని శాస్త్రావేత్తలచే నిరూపించబడింది.

గుండె జబ్బులు కలవారు:
అధిక రక్తపోటు కలవారు, ఇతర గుండె సమస్యలతో బాధపడేవారు,సీతాఫలం తినకూడదు అనే అపోహ ఉంది.కానీ అందులో నిజం లేదు . సీతాఫలంలో మాంగనీస్, విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది గుండెసమస్యలకు పరిష్కారం చూపుతుంది. శరీరంలో, ముఖ్యంగా ముఖ చర్మానికి మెరుగైన రక్త ప్రసరణను అందించి,చర్మంపై ముడతలు, మచ్చలను తొలగిస్తుంది.

PCOD సమస్య ఉన్నవారు:
పీసీఓడీ తో బాధపడే స్త్రీలు సీతాఫలం తినకూడదని చెబుతారు. అయితే నిజం చెప్పాలంటే సీతాఫలంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది సహజంగా శరీరం నుండి అలసట తొలగిస్తుంది.
ఇది కాకుండా పొట్టలో ఎసిడిటీ వల్ల తరచుగా అల్సర్‌లు క్యాన్సర్, రక్తహీనత, పొట్టసమస్యలు కు సీతాఫలం తరుచుగా తీసుకుంటూ ఉంటే మంచి ఉపశమనం కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news