కొబ్బరి నూనె తాగితే బరువు తగ్గచ్చా..?

కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నూనె వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. చాలా మంది కొబ్బరి నూనెను అనేక రకాలుగా వాడుతూ ఉంటారు. అయితే కొబ్బరి నూనెను ఉపయోగించడం వలన బరువు తగ్గడానికి అవుతుందని చాలా మంది అనుకుంటూ వుంటారు. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్లు కొబ్బరి నూనె వాడితే బరువు తగ్గొచ్చు అని అంటుంటారు. మరి నిజంగా కొబ్బరి నూనె ని వాడడం వలన బరువు తగ్గచ్చా..? ఈ విషయాన్ని ఇప్పుడు చూసేద్దాం.

అసలు ఈ నూనె ని ఎలా తయారు చేస్తారు..?

కొబ్బరి నూనె లోని దాదాపు 82 నుండి 92 శాతం సంతృప్త కొవ్వు ఉంటుంది. ఓ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లో చూస్తే… 11 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది.

కొబ్బరి నూనె తో బరువు తగ్గచ్చా..?

ఇది చాలా మంచిది. వివిధ లాభాలని దీనితో మనం పొందవచ్చు. బరువుని కొబ్బరి నూనె ద్వారా తగ్గచ్చా అనేది చూస్తే.. కొన్ని పరిశోధనలు బరువు తగ్గిస్తాయని చెబుతున్నాయి. కానీ మరి కొన్ని అయితే పని చేయదు అని అంటున్నాయి. కొబ్బరి నూనెని తీసుకుంటే బరువు తగ్గడంపై ఎలాంటి ఆధారాలు లేవు. టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెకు సుమారు 120 కేలరీలు చేరతాయి. మీ ఆహారం లో కేలరీలను ఇది పెంచుతుంది. అయితే బరువు తగ్గాలని అనుకునే వారు కొబ్బరి నూనె ని మాత్రమే డైట్ లో యాడ్ చేసుకుంటే సరిపోదు. బరువు తగ్గేందుకు మిగిలిన పద్ధతులని కూడా అనుసరించాలి. డైట్, జీవన విధానం పైన కూడా దృష్టి పెట్టాలి.